తెలంగాణలో టీడీపీ కనుమరుగు.. ఏపీలో అమరావతికే పరిమితం : మంత్రి అవంతి

టీడీపీ అధినేత చంద్రబాబుపై ఏపీ మంత్రి అవంతి శ్రీనివాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో శాంతిభద్రతలకు విఘాతం కల్గించే విధంగా చంద్రబాబు వ్యవరిస్తున్నారని విమర్శలు చేశారు.

  • Published By: veegamteam ,Published On : January 3, 2020 / 12:53 PM IST
తెలంగాణలో టీడీపీ కనుమరుగు.. ఏపీలో అమరావతికే పరిమితం : మంత్రి అవంతి

Updated On : January 3, 2020 / 12:53 PM IST

టీడీపీ అధినేత చంద్రబాబుపై ఏపీ మంత్రి అవంతి శ్రీనివాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో శాంతిభద్రతలకు విఘాతం కల్గించే విధంగా చంద్రబాబు వ్యవరిస్తున్నారని విమర్శలు చేశారు.

టీడీపీ అధినేత చంద్రబాబుపై ఏపీ మంత్రి అవంతి శ్రీనివాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో శాంతిభద్రతలకు విఘాతం కల్గించే విధంగా చంద్రబాబు వ్యవరిస్తున్నారని విమర్శలు చేశారు. చేసిన తప్పులు బయటపడతాయని ప్రజలను రెచ్చగొడుతున్నారని తెలిపారు. 

మిమ్మల్ని గెలిపించిన విశాఖ ప్రజలకు అభివృద్ధి అవసరం లేదా అని చంద్రబాబును ప్రశ్నించారు. 13 జిల్లాల టీడీపీ నేతలతో సమావేశం ఏర్పాటు చేసి.. మీరు దేనికి కట్టుబడి ఉన్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. జాతీయ పార్టీగా చెప్పుకునే టీడీపీ.. తెలంగాణలో కనుమరుగైందని విమర్శించారు. ఏపీలో కూడా టీడీపీ అమరావతికే పరిమితం అవుతుందని ఎద్దేవా చేశారు. 

ఆంధ్రప్రదేశ్ రాజధాని తరలింపు ప్రతిపాదన అంశం రాష్ట్రంలో కలకలం రేపింది. వైసీసీ, టీడీపీ నేతలు ఒకరిపై మరొరకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. రాజధాని మార్పు విషయంలో ఇరు పార్టీల కామెంట్స్ తారాస్థాయికి చేరాయి. ఒకరినొకరు పోటీ పడి విమర్శలు చేసుకుంటున్నారు. వైసీపీ నేతలు..చంద్రబాబును టార్గెట్ చేస్తే, టీడీపీ నేతలు సీఎం జగన్ ను టార్గెట్ చేస్తూ హాట్ కామెంట్స్ చేస్తున్నారు.