హవాలా డబ్బుల కోసమే జగన్ లండన్ పర్యటన : దేవినేని
హవాలా డబ్బుల కోసమే జగన్ లండన్ పర్యటనకు వెళ్తున్నారని ఏపీ మంత్రి దేవినేని ఉమా విమర్శించారు.

హవాలా డబ్బుల కోసమే జగన్ లండన్ పర్యటనకు వెళ్తున్నారని ఏపీ మంత్రి దేవినేని ఉమా విమర్శించారు.
విజయవాడ : హవాలా డబ్బుల కోసమే జగన్ లండన్ పర్యటనకు వెళ్తున్నారని ఏపీ మంత్రి దేవినేని ఉమా విమర్శించారు. అవినీతి డబ్బును హవాలా మార్గాల్లో రాష్ట్రానికి తరలిస్తున్నారని ఆరోపించారు. జగన్ కుట్రలు, కుతంత్రాలను ప్రజలు తెలుసుకోవాలన్నారు. ఈమేరకు దేవినేని మీడియాతో మాట్లాడుతూ జగన్ లండన్ వెళ్తే తప్పేంటి…హవాలా డబ్బు తెచ్చుకుంటే తప్పేంటని వైసీపీ అద్దె మైకు జీవీఎల్ మాట్లాడుతున్నారని పేర్కొన్నారు. కేంద్రం నిసిగ్గుగా, బాధ్యతారాహిత్యంగా జగన్ అనే అవినీతి పరుడిని కాపాడుతోందన్నారు. మిత్ర దోహం చేసి..ప్రత్యేకహోదా ఇవ్వకుండా జగన్ తో చేతులు కలిపి అవినీతి పరుడిని రక్షించి సీబీఐ, ఈడీ కేసుల్లో 4 సంవత్సరాల 9 నెలలుగా డ్రామాలు ఆడుతున్నారని కేంద్రంపై మండిపడ్డారు.
ఇవాళ బహిరంగ పొత్తులు పెట్టుకుని ఏ ముఖం పెట్టుకుని మోడీ.. ఆంధ్రప్రదేశ్ కు వస్తున్నారని ప్రశ్నించారు. అమిత్ షా శ్రీకాకుళం వస్తే ఖాళీ కుర్చీలు దర్శనమిచ్చాయని ఎద్దేవా చేశారు. చంద్రబాబును తిట్టడానికే రాజమండ్రికి వచ్చాడు తప్ప మరోటి కాదన్నారు. ఏం ఉద్దరించారని అమిత్ షా వచ్చారని నిలదీశారు. ఏం ఉద్దరించాలని మోడీ వస్తున్నారని ప్రశ్నించారు. విశాఖ రైల్వే జోన్, హోదాపై తేల్చాకే మోడీ ఏపీకీ రావాలన్నారు.
పోలవరానికి ఇవ్వాల్సిన 4121 కోట్లను ఎందుకు రిలీజ్ చేయడం లేదని, ఎందుకు ఈ అరాచకాలు చేస్తున్నారో మోడీ సమాధానం చెప్పాలన్నారు. నల్ల షర్ట్స్, నల్ల చీరలు, నల్లబ్యాడ్జీలు, నల్లబెలూన్లతో తమ నిరసన, బాధ, ఆవేదన తెలియజేస్తామని తెలిపారు. కెకె లైన్ తోసహా విశాఖ రైల్వే జోన్ కావాలన్నారు. పార్లమెంట్ లో చెప్పిన విధంగా ప్రత్యేక హోదా ఇవ్వాలని.. కడప స్టీల్ ఫ్యాక్టరీ ఇవ్వాలని, కేంద్రం నుంచి రావాల్సిన లక్ష కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
ఆంధ్రోళ్ల ముఖం మీద ఉమ్మినా సిగ్గులేదని తిట్టిన కేసీఆర్…ఆంధ్రప్రదేశ్ కు జగన్ మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా ప్రకటిస్తున్నాడని…యువరాజు కేటీఆర్ పరమానా చదువుతున్నాడని పేర్కొన్నారు. ’ఆంధ్ర బిర్యానీని పేడ అంటాడు.. ఆంధ్రా బ్రాహ్మణులకు సరిగ్గా మంత్రాలు రావంటున్నాడు… పోలవరానికి వ్యతిరేకంగా కవిత కేసులు వేస్తారని.. కవిత సోదరుడు కేటీఆర్.. జగన్ ను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రకటిస్తారని..ఆహా ఏమీ పవిత్ర బంధం మీది, ఏమీ అవినీతిబంధం మీది’ అని విమర్శించారు.
తమ ఆధునిక దేవాయలం, ఆంధ్రుల గుండె చప్పుడు అయిన పోలవరం ప్రాజెక్టుపై ఎంపీ కవిత సుప్రీంకోర్టులో కేసులు వేస్తే.. జగన్ మోహన్ రెడ్డి మీకు ముఖ్యమంత్రా.. అని అన్నారు. ’మా ప్రభుత్వాన్ని ఆపేందుకు ఒరిస్సా వేసిన కేసులో తెలంగాణ ప్రభుత్వం ఇంప్లీడ్ అయి.. కోర్టులో పోలవరానికి నెల నెలా అడ్డుపడుతుంటే… మీరు తమకు నీతులు చెబుతున్నారా ? జగన్ మోహన్ రెడ్డితో కలిసి అభ్యర్థులను నిర్ణయించి..మీ గిఫ్ట్ డబ్బులకు కక్కుర్తి పడిన జగన్, మీరా అభ్యర్థులను ప్రకటించేది?’ అని ప్రశ్నించారు. ’రా.. కేసీఆర్ విశాఖపట్నం వచ్చి చెప్పు.. మీ రాజకీయ అంశాలు బయటపెట్టండి.. మీ అవినీతి రంకులన్నీ బయటపెట్టాలి’ అని అన్నారు. జగన్, కేసీఆర్, మోడీ కలిసి జగన్నాటకం ఆడుతున్నారని విమర్శించారు.