ఐదుగురు సిట్టింగ్‌లు ఔట్..! అనంతపురం జిల్లా వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితా సిద్ధం..!

ఐదుగురిని ఇప్పటికే సీఎం జగన్ కలిసి.. ఎందుకు టికెట్ ఇవ్వలేకపోతున్నా? ఎందుకు అక్కడ కొత్త వారికి అవకాశం కల్పించాల్సి వచ్చింది? అనేదానిపై సీఎం జగన్ వారికి వివరించినట్లు సమాచారం.

Ananthapur YCP MLA Candidates

YCP MLA Candidates : వైసీపీలో మార్పు చేర్పులు అనంతపురం జిల్లాలో అలజడి రేపాయి. ఈ మార్పుల్లో భాగంగా అనంతపురం జిల్లాలో ఐదుగురు సిట్టింగ్ ఎమ్మెల్యేలపై వేటు పడినట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యేలు కాపు రామచంద్రారెడ్డి, జొన్నలగడ్డ పద్మావతి, సిద్ధారెడ్డి, శంకర్ నారాయణ, తిప్పేస్వామి స్థానంలో కొత్త వారికి అవకాశం ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. మంత్రి ఉషశ్రీ చరణ్ ను కల్యాణదుర్గం నుంచి పెనుగొండకు మార్చనున్నారని సమాచారం అందుతోంది.

వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా వైసీపీలో భారీగా మార్పులు చేర్పులు చేస్తున్నారు సీఎం జగన్. 11 స్థానాలకు సంబంధించిన మార్పులపై ప్రకటన చేయనున్నారు జగన్. దీనికి సంబంధించి కసరత్తు పూర్తైంది. 11 స్థానాల్లో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు చెందిన 6 స్థానాలు, అనంతపురం జిల్లాకు సంబంధించిన 5 స్థానాల్లో మార్పులు ఉండబోతున్నట్లు సమాచారం.

అనంతపురం జిల్లాకు సంబంధించిన మార్పులు పరిశీలిస్తే.. ఇక్కడ ఐదుగురు సిట్టింగ్ ఎమ్మెల్యేలకు ఈసారి సీఎం జగన్ టికెట్ నిరాకరించినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే ఈ ఐదుగురిని ఇప్పటికే సీఎం జగన్ కలిసి.. ఎందుకు టికెట్ ఇవ్వలేకపోతున్నా? ఎందుకు అక్కడ కొత్త వారికి అవకాశం కల్పించాల్సి వచ్చింది? అనేదానిపై సీఎం జగన్ వారికి వివరించినట్లు సమాచారం. గత నాలుగు రోజుల నుంచి అనంతపురం జిల్లాకు చెందిన ఈ ఐదుగురు ఎమ్మెల్యేలు రెండు మూడు సార్లు తాడేపల్లి క్యాంప్ కార్యాలయానికి వచ్చి వెళ్లినట్లు తెలుస్తోంది. పార్టీ అధిష్టానంతో పాటు సీఎం జగన్ వీరికి నచ్చచెప్పినట్లు సమాచారం.

* శింగనమల నియోజకవర్గానికి సంబంధించి సిట్టింగ్ ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతికి వచ్చే ఎన్నికల్లో టికెట్ లేదని తెలుస్తోంది. ఇక్కడ కొత్త ఇంఛార్జ్ ని ప్రకటించనున్నారు.
* రాయదుర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి ప్లేస్ లో కొత్త వారిని తీసుకురాబోతున్నారు. మెట్టు గోవింద రెడ్డి పేరు దాదాపుగా ఖరారైనట్లు సమాచారం.
* కల్యాణదుర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే, మంత్రిగా ఉన్న ఉషశ్రీ చరణ్ కు స్థాన చలనం కల్పించారని, ఆమెను పెనుగొండకు మార్చినట్లు సమాచారం.
* పెనుగొండకు సంబంధించి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న శంకర్ నారాయణను పూర్తిగా తప్పిస్తున్నారని, ఆయనను అనంతపురం ఎంపీగా పంపే అవకాశం ఉందని తెలుస్తోంది. శంకర్ నారాయణ స్థానంలో ఉషశ్రీ చరణ్ ను నియమిస్తూ సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నారు. దానికి సంబంధించి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
* మడకశిర నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే తిప్పేస్వామికు టికెట్ లేదని తెలుస్తోంది. ఆయన స్థానంలో కొత్త ఇంఛార్జ్ రానున్నారు.
* కదిరిలో సిట్టింగ్ ఎమ్మెల్యే సిద్ధారెడ్డికి నో టికెట్ అని చెప్పినట్లు తెలుస్తోంది.

ఉమ్మడి అనంతపురం జిల్లా చాలా కీలకమైన జిల్లా. ఇక్కడ కొత్త ఇంఛార్జ్ ల పేర్లు దాదాపుగా ఖరారైనట్లు తెలుస్తోంది.
* రాయదుర్గం – కాపు రామచంద్రారెడ్డి స్థానంలో మెట్టు గోవిందరెడ్డికి అవకాశం
* పెనుగొండ – శంకర్ నారాయణ స్థానంలో ఉషశ్రీ చరణ్