ఉగ్రవాద చర్యలను అరికట్టడంలో బీజేపీ విఫలం : బివి.రాఘవులు

  • Published By: veegamteam ,Published On : February 15, 2019 / 04:02 PM IST
ఉగ్రవాద చర్యలను అరికట్టడంలో బీజేపీ విఫలం : బివి.రాఘవులు

Updated On : February 15, 2019 / 4:02 PM IST

విజయనగరం : ఉగ్రవాద చర్యలను అరికట్టడంలో బీజేపీ విఫలమైందని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యులు బీవీ.రాఘవులు విమర్శించారు. ఈమేరకు ఆయన విజయనగరంలో మీడియాతో మాట్లాడుతూ బీజేపీ తప్పుడు విధానాల వల్ల ఉగ్రవాదం పెరిగిందన్నారు. ఉగ్రవాదాన్ని ప్రజల నుంచి వేరుచేయకుండా సైనిక చర్యలతో ఉగ్రవాదులను నిర్మూలించలేరని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం అన్ని వర్గాలతో చర్చలు జరపాలని సూచించారు.