చంద్రబాబుది వృధా ప్రయాస..పార్టీనే తుడిచి పెట్టుకుపోతుంది…: జీవీఎల్ 

  • Publish Date - May 6, 2019 / 02:54 PM IST

ఢిల్లీ : గత ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం పై వ్యతిరేకత కనిపించగా, నేడు బీజేపీ ప్రభుత్వం పై ప్రజల్లో సానుకూల వాతావరణం ఉందని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు అన్నారు. ఆంధ్రప్రదేశ్ లో ప్రజలు మార్పుకోసం ఓటు వేశారని, ఏపీలో టీడీపీ తుడిచిపెట్టుకొని పోవడం ఖాయమని ఆయన జోస్యం చెప్పారు. అధికారం పోతుందని తెలిసి కూడా చంద్రబాబు ఆరాటం చూస్తుంటే జాలివేస్తుందని ఆయన అన్నారు.  

చంద్రబాబు ఊడిపోయే పదవి పై వ్యామోహం పెంచుకోవడం మంచిది కాదని హితవు పలికారు.  మంగళగిరి లో లోకేష్ ఓడిపోబోతున్నారని జీవీఎల్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ లోనే టీడీపీ గెలిచే స్థితిలో లేదు, ఇక చంద్రబాబు దేశవ్యాప్తంగా పర్యటించి సాధించేది ఏం ఉండదని ఆయన వ్యాఖ్యానించారు. పోలవరం పై చంద్రబాబు కు శ్రధ్దలేదని,కేవలం  కేంద్రం ఇచ్చే నిధులపై మాత్రమే శ్రధ్ధ అని జీవీఎల్ విమర్శించారు. ఎన్నికల సంఘాన్ని తిట్టడం చంద్రబాబు కి పరిపాటిగా మారిందని, తెలంగాణతో సఖ్యత పంచుకోవడంలో విఫలమై కేంద్రం పై నెపం వేయాలని చంద్రబాబు చూస్తున్నారని ఆరోపించారు.రెండు రాష్ట్రాల ఏర్పాటు అనంతరం తెలుగు రాష్ట్రాల మధ్య ఘర్షణ వాతావరణం లేదని ఆయన తెలిపారు.