ఇసుక కొరత : బీజేపీ పోరుబాట

ఏపీలో ఇసుక కొరతపై విపక్షాలు పోరుబాటు బట్టాయి. వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నారు. తామే మొదట ఉద్యమం చేపట్టామని అంటోంది బీజేపీ. ఇసుక కొరతపై బీజేపీ పోరాటం ఉధృతం చేసింది. 2019, నవంబర్ 04వ తేదీ సోమవారం విజయవాడలో ధర్నా కార్యక్రమం చేపడతామని కన్నా లక్ష్మినారాయణ ప్రకటించారు. జగన్ ప్రభుత్వ తీరు వల్లే రాష్ట్రంలో ఇసుక కొరత ఏర్పడిందని ఆయన ఆరోపించారు. ఇసుక సమస్యపై మొదట ఉద్యమం చేపట్టింది బీజేపీయేనన్నారు. జనసేన అధ్యక్షుడు పవన్ అయినా మరొకరైనా… ప్రజాసమస్యలపై నిరసనలు చేపడితే సంఘీభావం తెలుపుతామన్నారు.
ప్రభుత్వం భవన కార్మికులకు 10వేల భృతి ఇవ్వాలని కన్నా లక్ష్మినారాయణ డిమాండ్ చేశారు. ఏపీలో కృతిమంగా ఇసుక కొరతను సృష్టించారని, ఇసుక లేకపోవడంతో ఎన్నో భవన నిర్మాణాలు నిలిచిపోయాయన్నారు. ఇసుక కొరత వల్ల లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు రోడ్డున పడ్డారని వెల్లడించారు. వీరందరికి ప్రభుత్వం పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్మికుల ఇబ్బందులను ప్రభుత్వం పట్టించుకోదా అని నిలదీశారు. వెంటనే సమస్యను తీర్చాలని కన్నా డిమాండ్ చేశారు.
Read More : విశాఖలో టీడీపీకి మరో షాక్ : వైసీపీలోకి అయ్యన్న పాత్రుడు సోదరుడు