Kunwar Danish Ali: అలా అయితే ప్రతి మసీదు కింద గుడి ఉంటుందట.. జ్ఞాన్‌వాపి మసీదు అంశంపై బీఎస్పీ ఎంపీ
సుప్రీం కోర్ట్ దీనిపై త్వరలో విచారణ చేపట్టి ఉత్తర్వులు జారీ చేస్తుందని ఆశిస్తున్నట్లు ఎంపీ డానిష్ అలీ అన్నారు. ఈ మొత్తం వివాదాన్ని ఆయన రాజకీయ వివాదంగా అభివర్ణించారు

Gyanvapi Mosque Issue: వారణాసిలోని జ్ఞాన్‌వాపి మసీదులో సర్వేకు హైకోర్టు నుంచి గ్రీన్ సిగ్నల్ లభించింది. ఆ తర్వాత మసీదు ప్రాంగణంలో ఏఎస్‌ఐ (భారత పురావస్తు సర్వే) సర్వే నిర్వహించనున్నారు. హైకోర్టు తీర్పు తర్వాత ఈ అంశంపై మరోసారి చర్చ జోరందుకుంది. కాగా, ఉత్తరప్రదేశ్‌లోని అమ్రోహాకు చెందిన బహుజన్ సమాజ్ పార్టీ నేత, ఎంపీ కున్వర్ డానిష్ అలీ కూడా జ్ఞాన్‌వాపి కేసుకు సంబంధించి తాజాగా ఒక బలమైన విమర్శ చేశారు. అసలు సమస్య నుంచి దృష్టి మళ్లించేందుకే ఇదంతా సాగుతోందని, ఈ లెక్కన చూసుకుంటూ పోతే ప్రతి మసీదు కింద గుడి ఉంటుందని డానిష్ అలీ అన్నారు.
1991 నాటి ప్రార్థనా స్థలాల చట్టాన్ని మాత్రమే అమలు చేయాలని, తద్వారా అలాంటి వివాదాలు ముగుస్తాయని ఆయన అన్నారు. అటువంటి పరిస్థితిలో ఎవరైనా ఏదైనా మతపరమైన స్థలంపై క్లెయిమ్ చేయవచ్చని ఆయన సూచించారు. జ్ఞాన్వాపికి సంబంధించి ఎంపీ కున్వర్ డానిష్ అలీ మాట్లాడుతూ.. రాజకీయ లబ్ధి కోసమే ఇదంతా కొనసాగుతుందన్నారు. ‘‘కొందరు మసీదులో గుడి కోసం చూస్తారు, కొందరు గుడిలో మఠం కోసం చూస్తారు. ఇలా చేస్తూ వాస్తవ సమస్యలపై దృష్టి మలుస్తుంటారు. 1991 నాటి పూజా స్థలాల చట్టాన్ని ఈ పార్లమెంట్‌లోనే ఏకగ్రీవంగా ఆమోదించారు. దానిని అమలు చేయాలి. ఇది జరగకపోతే, వివాదాలు నిరంతరం కొనసాగుతాయి’’ అని అన్నారు.
Ajit Pawar: అజిత్ పవార్ ముఖ్యమంత్రి కాబోతున్నారా? మొత్తానికి క్లారిటీ ఇచ్చేసిన దేవేంద్ర ఫడ్నవీస్
సుప్రీం కోర్ట్ దీనిపై త్వరలో విచారణ చేపట్టి ఉత్తర్వులు జారీ చేస్తుందని ఆశిస్తున్నట్లు ఎంపీ డానిష్ అలీ అన్నారు. ఈ మొత్తం వివాదాన్ని ఆయన రాజకీయ వివాదంగా అభివర్ణించారు. జ్ఞాన్‌వాపి మసీదు కాంప్లెక్స్ సర్వేను వ్యతిరేకిస్తూ అంజుమన్ ఇంతేజామియా మసీదు కమిటీ వేసిన పిటిషన్‌ను అలహాబాద్ హైకోర్టు తిరస్కరించి సర్వేకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. జూలై 21న వారణాసి జిల్లా కోర్టు ఆదేశాలను అంజుమన్ ఇంతేజామియా కమిటీ హైకోర్టులో సవాలు చేసింది. సర్వే కోసం ఆర్డర్‌ను పాస్ చేస్తూ, నిర్మాణం దెబ్బతింటుందని ఏఎస్ఐ హామీని నమ్మవద్దని హైకోర్టు పేర్కొంది. అదే సమయంలో సర్వే కోసం ఎటువంటి తవ్వకాలు జరపకూడదని పేర్కొంది.