Ajit Pawar: అజిత్ పవార్ ముఖ్యమంత్రి కాబోతున్నారా? మొత్తానికి క్లారిటీ ఇచ్చేసిన దేవేంద్ర ఫడ్నవీస్

దేవేంద్ర ఫడ్నవీస్ మాట్లాడుతూ.. 2019 ఒక ప్రత్యేకమైన సంవత్సరం. 2019లో ఎన్నో రికార్డులు నమోదయ్యాయి. ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే పేరిట ఓ రికార్డు ఉంది. 2019 హీరో ఏక్‌నాథ్ షిండే, కాగా ఇప్పుడు రెండో హీరో అజిత్ పవార్. ఉద్ధవ్ ఠాక్రే సీఎం అయ్యారు

Ajit Pawar: అజిత్ పవార్ ముఖ్యమంత్రి కాబోతున్నారా? మొత్తానికి క్లారిటీ ఇచ్చేసిన దేవేంద్ర ఫడ్నవీస్

Updated On : August 3, 2023 / 4:18 PM IST

Devendra Fadnavis: వర్షాకాలం తర్వాత మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా అజిత్ పవార్ పదవీ బాధ్యతలు చేపడతారని మహారాష్ట్ర పొలిటికల్ కారిడార్‌లో జోరుగా చర్చ సాగుతోంది. అయితే ఈ ప్రచారానికి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ సమాధానం ఇస్తూ సీఎం పదవిలో మార్పు ఉండదని గురువారం అసెంబ్లీలో స్పష్టం చేశారు. 2019 తర్వాత చాలా మార్పులు వచ్చాయని, అయితే ఇప్పుడు ఎలాంటి మార్పు రాబోదని, ఇలా చెప్పడం ద్వారా అజిత్ పవార్ సీఎం కావడంపై జరుగుతున్న చర్చలకు స్వస్తి పలికానని ఫడ్నవీస్ అన్నారు.

Kharge vs Dhankar: నాకు పెళ్లైంది, కోపం రాదు.. రాజ్యసభలో చైర్మన్ ధన్‭కడ్, విపక్ష నేత ఖర్గే మధ్య జోకులు

సభలో దేవేంద్ర ఫడ్నవీస్ మాట్లాడుతూ “2019 ఒక ప్రత్యేకమైన సంవత్సరం. 2019లో ఎన్నో రికార్డులు నమోదయ్యాయి. ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే పేరిట ఓ రికార్డు ఉంది. 2019 హీరో ఏక్‌నాథ్ షిండే, కాగా ఇప్పుడు రెండో హీరో అజిత్ పవార్. ఉద్ధవ్ ఠాక్రే సీఎం అయ్యారు. అజిత్ పవార్ మొదట డిప్యూటీ సీఎం అయ్యారు. ఆపై ప్రతిపక్ష నాయకుడు, ఇప్పుడు మళ్లీ డిప్యూటీ సీఎం అయ్యారు. రాష్ట్ర ప్ర‌జ‌లు ఎన్నో మార్పుల‌ను చూశార‌ు. ఇక ఎలాంటి మార్పు ఉండ‌దు’’ అని అన్నారు.

Delhi Metro : మెట్రోలో మహిళల లొల్లి.. చెప్పుతో కొడతానంటూ ఒకరిపై ఒకరు మాటల యుద్ధం

మహాయుతి సీఎంగా ఏక్‌నాథ్ షిండే కొనసాగుతారని కొద్దిరోజుల క్రితం మీడియా ముందు ఫడ్నవీస్ స్పష్టం చేశారు. ఇప్పుడు అసెంబ్లీలో కూడా అదే విషయాన్ని స్పష్టం చేశారు. అదే సమయంలో, రెండు రోజుల క్రితం అజిత్ పవార్ పూణేలో తన వాదనను వినిపించారు. రాష్ట్రానికి సీఎం ఏక్‌నాథ్ షిండే అని అజిత్ పవార్ సైతం అన్నారు. తాను, దేవేంద్ర ఫడ్నవీస్ ఇద్దరూ డిప్యూటీ సీఎంలుగా పనిచేస్తున్నామని, మనకు లభించిన బాధ్యతను మనం నిర్వర్తించాలని ఆయన అన్నారు. ఇదిలా ఉండగా, అజిత్ పవార్‌కు ముఖ్యమంత్రి పదవిని బీజేపీ ఆఫర్ చేసిందని ప్రతిపక్ష కాంగ్రెస్ నాయకుడు పృథ్వీరాజ్ చవాన్, శివసేన ఎంపీ సంజయ్ రౌత్ పేర్కొన్నారు.