చంద్రబాబు కటకటాల వెనక్కి వెళ్లాల్సిందే: జగన్

కాకినాడలో జరుగుతోన్న సమర శంఖరావం భారీ బహిరంగ సభలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుపై ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మండిపడ్డారు. తూర్పు గోదావరి నుంచి ఎన్నికల ప్రచారంలో భాగంగా సభలో మాట్లాడిన జగన్.. చంద్రబాబుపై చురకలు వేశారు. సైబర్ క్రైమ్‌లో సీఎం చంద్రబాబు, ఐటీ మంత్రి లోకేశ్ ఇద్దరూ నేరగాళ్లేనని ఆరోపించారు.
Read Also : ‘సివిజిల్’ యాప్ :ఎలక్షన్ కంప్లయింట్స్ ఎవరైనా చేయొచ్చు
చంద్రబాబు నాయుడు ఆంధ్ర ప్రజల ఆధార్ కార్డులు, వ్యక్తిగత సమాచారాన్ని ఎవరి అనుమతితో ప్రైవేట్ సంస్థలకు అప్పగించిందని ప్రశ్నించారు. ఇప్పటికే రాష్ట్రంలో ప్రతి ఇంటికి తిరిగి సర్వేలు చేసి టీడీపీకి అనుకూలమైన వారి ఓట్లు మాత్రమే ఉంచి.. మిగిలిన వారి ఓట్లను తొలగించారని దుయ్యబట్టారు.
చంద్రబాబు అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఇష్టమొచ్చినట్లు వ్యవహరిస్తున్నాడని విమర్శించారు. ఇవే కాదు.. ఎన్నికలు జరిగేందుకు ఉన్న నెల రోజుల సమయంలో మరిన్ని నేరాలకు పాల్పడతాడంటూ తెలియజేశాడు. దాంతో పాటుగా ఓటర్లందరికీ విలువైన సమాచారాన్ని అందించారు. ప్రతి ఒక్కరూ 1950 నెంబర్‌కు డయల్ చేసి తమ ఓటు హక్కు ఉందో ఇప్పటికే డిలీట్ అయిపోయిందో.. చూసుకోవాలని తెలిపారు.
Read Also : ఆ సర్వేలో చెప్పిన జనం : మళ్లీ మోడీనే ప్రధాని కావాలి
Read Also : లైటింగ్ ఎఫెక్ట్ : ఎయిర్‌పోర్ట్ తరహాలో వరల్డ్ క్లాస్ రైల్వే స్టేషన్లు