Lok Sabha Elections 2024 : రాష్ట్రమంతా 144 సెక్షన్, 160 కేంద్ర కంపెనీల బలగాలతో భద్రత- ఎన్నికల ఏర్పాట్లపై సీఈవో వికాస్ రాజ్

EVM తరలించే వాహనాలకు GPS ఉంటుంది. సీఈఓ ఆఫీస్ మానిటరింగ్ ఉంటుంది.

Lok Sabha Elections 2024 : రాష్ట్రమంతా 144 సెక్షన్, 160 కేంద్ర కంపెనీల బలగాలతో భద్రత- ఎన్నికల ఏర్పాట్లపై సీఈవో వికాస్ రాజ్

Updated On : May 11, 2024 / 5:15 PM IST

Lok Sabha Elections 2024 : తెలంగాణలో లోక్ సభ ఎన్నికల ఏర్పాట్ల వివరాలను సీఈఓ వికాస్ రాజ్ మీడియాకు తెలియజేశారు. సాయంత్రం 6 గంటల నుంచి 144 సెక్షన్ రాష్ట్రం అంతటా అమలవుతుందని తెలిపారు. నలుగురి కంటే ఎక్కువ వ్యక్తులు తిరగొద్దన్నారు. ఎలక్ట్రానిక్ మీడియాలో 6 గంటల నుంచి ఎలాంటి ప్రచారం చేయొద్దన్నారు. జూన్ 1వ తేదీ సాయంత్రం 6.30 వరకు ఎగ్జిట్ పోల్స్ పై బ్యాన్ ఉంటుందని తెలిపారు. కొన్ని సంస్థలు మే 13వ తేదీన సెలవు ఇవ్వడం లేదని తెలుస్తోంది, ఆ రోజు సెలవు ఇవ్వకపోతే చర్యలు ఉంటాయని సీఈవో వికాస్ రాజ్ హెచ్చరించారు. కళ్యాణ మండపాలు, కమ్యూనిటీ హాల్స్, హోటల్స్ లలో ఉన్న ఇతర జిల్లాల వ్యక్తులు వెళ్లిపోవాలని ఆదేశించారు.

”రేపు, ఎల్లుండి పేపర్లలో ప్రకటనల కోసం ముందస్తు అనుమతి తీసుకోవాలి. 160 కేంద్ర కంపెనీల బలగాలు రాష్ట్రంలో ఇప్పటికే మోహరించాయి. ఇతర రాష్ట్రాల నుంచి 20వేల పోలీస్ బలగాలు మోహరించాయి. ప్రతీ పార్లమెంట్ సెగ్మెంట్ లో రెండేసి బ్యాలెట్ యూనిట్లు ఉంటాయి. సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ ఉప ఎన్నికలలో 232 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. EVM తరలించే వాహనాలకు GPS ఉంటుంది. సీఈఓ ఆఫీస్ మానిటరింగ్ ఉంటుంది. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు రూ.320 కోట్లు సీజ్ చేశాం. 8600 FIR లు నమోదయ్యాయి. లక్ష 90వేల మంది సిబ్బంది పోలింగ్ విధుల్లో నేరుగా పాల్గొంటున్నారు. మొత్తం 3లక్షల మంది ఉన్నారు.

వచ్చే 48 గంటల పాటు వచ్చే ఫిర్యాదులపై 100 నిమిషాల్లో చర్యలు ఉంటాయి. బల్క్ MSM సాయంత్రం 6 గంటల నుంచి బంద్ చెయ్యాలి. లక్ష 90 వేల పోస్టల్ బ్యాలెట్ ఓట్లు ఇప్పటివరకు పోల్ అయ్యాయి. 21680 మంది ఓటర్లు హోం ఓటింగ్ ఉపయోగించుకున్నారు. 1950 నంబర్ కి ECI స్పెస్ EPIC నంబర్ పెడితే ఓటర్ కు డిటైల్స్ వస్తాయి. ఏజెన్సీ ఏరియాల్లో 328 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశాము. అత్యల్పంగా ఓటర్లు ఉన్నవి మూడు పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. పొలిటికల్ పార్టీలపై 92 ఫిర్యాదులు వచ్చాయి. ఆయా ఫిర్యాదులపై ఎప్పటికప్పుడు నోటీసులు ఇస్తున్నాం. కొన్నింటిపై ECI చర్యలు తీసుకుంటుంది. పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ 82శాతం ఇప్పటివరకు పూర్తైంది.