డబుల్ హ్యాపీ : ఆమంచి రాజీనామాతో బాబు ఖుషీ

ప్రకాశం : ఆమంచి కృష్ణమోహన్ టీడీపీ నుంచి వెళ్లిపోవడం వల్ల పార్టీకి వచ్చిన నష్టమేమీ లేదా..? నియోజకవర్గంలో ఆమంచిపై తీవ్ర వ్యతిరేకత ఉందని టీడీపీ అధినేత ముందే ఎలా

  • Published By: veegamteam ,Published On : February 13, 2019 / 01:25 PM IST
డబుల్ హ్యాపీ : ఆమంచి రాజీనామాతో బాబు ఖుషీ

ప్రకాశం : ఆమంచి కృష్ణమోహన్ టీడీపీ నుంచి వెళ్లిపోవడం వల్ల పార్టీకి వచ్చిన నష్టమేమీ లేదా..? నియోజకవర్గంలో ఆమంచిపై తీవ్ర వ్యతిరేకత ఉందని టీడీపీ అధినేత ముందే ఎలా

ప్రకాశం : ఆమంచి కృష్ణమోహన్ టీడీపీ నుంచి వెళ్లిపోవడం వల్ల పార్టీకి వచ్చిన నష్టమేమీ లేదా..? నియోజకవర్గంలో ఆమంచిపై తీవ్ర వ్యతిరేకత ఉందని టీడీపీ అధినేత ముందే ఎలా పసిగట్టారు..?  ఆమంచి వెళ్లడానికి ముందే చీరాలపై ప్రత్యేక బ్లూ ప్రింట్‌ తయారు చేశారా..? జరుగుతున్న పరిణామాలు అవుననే అంటున్నాయి.

 

ఆమంచి పార్టీ వీడతారన్న విషయాన్ని నెలక్రితమే పసిగట్టిన చంద్రబాబు.. స్థానికుడైన మాజీ మంత్రి కరణం బలరాంను అలర్ట్‌ చేశారు. చీరాలపై దృష్టి పెట్టాల్సిందిగా ఆదేశాలు కూడా ఇచ్చారు.  నియోజకవర్గంలో కార్యకర్తల సమావేశం నిర్వహించాలని సూచించారు. దీని వెనుక పెద్ద కథే ఉందని అంటున్నారు. కరణం బలరాం…చీరాల నియోజకవర్గానికి స్థానికుడు. చిన్నగంజాం మండలం  తిమ్మసముద్రంలో పుట్టి పెరిగారు. విద్యాభ్యాసం కోసం రామకృష్ణాపురం వెళ్లారు. జిల్లా అధ్యక్షుడిగా పని చేసిన సమయంలో.. చీరాలలో తనకంటూ ప్రత్యేక వర్గాన్ని ఏర్పాటు చేసుకున్నారు. తన  కూతుర్ని చీరాలకు చెందిన డాక్టర్ గోరంట్ల సుబ్బారావు కుమారుడు రవికిరణ్‌కు ఇచ్చి పెళ్లి చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ సామాజిక వర్గాల్లో మంచి పట్టు ఉంది. ఆమంచిని ఢీ కొట్టే సమర్థవంతమైన  నాయకుడు కావడంతోనే వ్యూహాత్మకంగా కరణం బలరాంను కార్యకర్తల సమావేశం నిర్వహించాలని ఆదేశించారు. ఆమంచికి బద్ద శత్రువులైన పాలేటి రామారావు, పోతుల సునీత, కరణం  బలరాంను…ఒక తాటిపైకి తీసుకొచ్చి ప్లాన్‌ రూపొందించారు. ముగ్గురు కలిసి కట్టుగా పని చేస్తే….ఆమంచికి కష్టాలు తప్పవు.

 

దీనికి నిదర్శనంగానే మూడు రోజుల క్రితం చీరాలలో కరణం బలరాం ఫ్లెక్సీలు కూడా వెలిశాయి. అటు.. చంద్రబాబు ఆదేశాలతో ఫిబ్రవరి 14వ తేదీ గురువారం చీరాలలో కార్యకర్తల సమావేశం  నిర్వహిస్తానని కరణం బలరాం 10టీవీకి చెప్పారు. తాజా రాజకీయ పరిణామాలపై ముఖ్యనేతలు, కార్యకర్తలతో చర్చిస్తానన్న ఆయన….పోటీ చేసే విషయంపై స్పష్టత ఇవ్వలేదు. ఇప్పటికే మంత్రి  శిద్ధా రాఘవరావుతో భేటీ అయి…పలు అంశాలపై చర్చించారు. మంత్రులు శిద్ధా రాఘవరావు, సోమిరెడ్డి చంద్రమోహన్‌ రెడ్డిలు చీరాలకు వెళ్లి…కార్యకర్తల సమావేశంలోపాల్గొననున్నారు. ఆమంచి  కృష్ణమోహన్‌ పార్టీ వీడటం ద్వారా….చంద్రబాబుకు పలు సమస్యలకు పరిష్కారం దొరికినట్లయింది. అద్దంకి అసెంబ్లీ టికెట్‌ ఆశిస్తున్న కరణం బలరాంను చీరాల నుంచి పోటీ చేయించడం, అద్దంకి  సిట్టింగ్ ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్‌కు…అదే సీటు ఇచ్చేందుకు మార్గం సుగమం అయింది. ఆమంచి కృష్ణమోహన్‌ టీడీపీలోనే ఉంటే…పార్టీ రెండు వర్గాలుగా చీలిపోయేది. ఆమంచి ఒక  వర్గంగా….పోతుల సునీత మరోవర్గంగా ఉండిపోయారు. దీంతో తెలుగుదేశం పార్టీకి పునర్‌ వైభవం వచ్చేది కాదు. సిట్టింగ్ ఎమ్మెల్యే వైసీపీలో చేరడం ద్వారా…పార్టీ బలపడటానికి ఇదే సరైనా సమయమని చంద్రబాబు భావించినట్లు తెలుస్తోంది.

 

సీఎం చంద్రబాబు…చీరాలలో రాజకీయ పరిస్థితిపై ఇటీవల ఐవీఆర్‌ఎస్‌ సర్వే నిర్వహించారు. సర్వేలో మెజార్టీ సభ్యులు….ఆమంచికి వ్యతిరేకంగా అభిప్రాయాన్ని వ్యక్తం చేశారని సమాచారం. పదేళ్లు  ఎమ్మెల్యేగా ఉన్న ఆమంచి….నియోజకవర్గంలో ఇసుకదందా ద్వారా భారీగా డబ్బు సంపాదించారన్న ఆరోపణలు ఉన్నాయి. చీరాల టికెట్‌ ఆమంచికి ఇచ్చినా….గెలుపు కష్టమేనని చంద్రబాబు  భావించినట్లు తెలుస్తోంది. దీంతో సిట్టింగ్ ఎమ్మెల్యే గురించి పెద్దగా పట్టించుకోలేదని సమాచారం.

Also Read: దేవెగౌడ చనిపోతారు…కర్ణాటకలో దుమారం రేపిన మరో ఆడియో టేప్

Also Read: గడియారాల గొడవ : ఎమ్మెల్యే చెవిరెడ్డిపై ఈసీకి ఫిర్యాదు