YCP Fourth List : వైసీపీ ఫోర్త్ లిస్ట్‌పై సీఎం జగన్ కసర్తతు.. ప్రధానంగా ప్రకాశం జిల్లాపై ఫోకస్
ఒంగోలు ఎంపీ స్థానంపై సస్పెన్స్ కొనసాగుతోంది. బాలినేని శ్రీనివాస్ రెడ్డి నిన్న సీఎం జగన్ ని కలిసి చర్చించారు.

CM Jagan Special Focus On YCP Fourth List
YCP Fourth List : వైసీపీ ఫోర్త్ లిస్ట్ పై కసరత్తు కొనసాగుతోంది. తాడేపల్లి క్యాంప్ కార్యాలయానికి ఎమ్మెల్యేలు క్యూ కట్టారు. ప్రధానంగా ప్రకాశం జిల్లాపై సీఎం జగన్ ఫోకస్ పెట్టారు. ఒంగోలు, గిద్దలూరు, కనిగిరి, మార్కాపురం, కందుకూరు నియోజకవర్గాల్లో మార్పులపై కసరత్తు చివరి దశకు చేరుకుంది. ఇప్పటికే తాడేపల్లి క్యాంప్ కార్యాలయానికి కనిగిరి, మార్కాపురం ఎమ్మెల్యేలు(నాగార్జున రెడ్డి) చేరుకున్నారు. అయితే ఒంగోలు ఎంపీ స్థానంపై సస్పెన్స్ కొనసాగుతోంది. బాలినేని శ్రీనివాస్ రెడ్డి నిన్న సీఎం జగన్ ని కలిసి చర్చించారు.
అటు.. మంత్రి అంబటి రాంబాబు, బియ్యపు మధుసూదన్ రెడ్డి, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, మానుగుంట మహిధర్ రెడ్డి, బుర్ర మధుసూదన్ యాదవ్ లు కూడా క్యాంప్ కార్యాలయానికి వచ్చారు.
వైఎస్ఆర్ సీపీ అసెంబ్లీ ఇంఛార్జ్ లకు సంబంధించిన మార్పుల కసరత్తు ఇంకా కొనసాగుతోంది. ఇప్పటికే మూడు జాబితాలు వైసీపీ విడుదల చేసింది. 59 చోట్ల (అసెంబ్లీ, లోక్ సభ) మార్పులు చేర్పులు చేశారు జగన్. ఇందులో 50 అసెంబ్లీ స్థానాలు, 9 పార్లమెంటు నియోజకవర్గాలు ఉన్నాయి. మరికొన్ని నియోజకవర్గాలకు సంబంధించి మార్పులు చేర్పులపై జగన్ కసరత్తు చేస్తున్నారు. కొంతమంది ఎమ్మెల్యేలు తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో జగన్ ను కలిశారు. ముఖ్యంగా ప్రకాశం జిల్లాకు సంబంధించి సీఎం జగన్ ఫోకస్ పెట్టారు.
Also Read : ఆ 13 మంది ఎవరు? ఎంపీ అభ్యర్థులపై వైసీపీ ముమ్మర కసరత్తు
ఇప్పటికే ప్రకాశం జిల్లాకు సంబంధించి కొన్ని నియోజకవర్గాలపై క్లారిటీ వచ్చింది. మరికొన్ని స్థానాలపై స్పష్టత రావాల్సి ఉంది. కనిగిరి, కందుకూరు, మార్కాపురం, ఒంగోలు.. ఈ నాలుగు నియోజవర్గాలకు సంబంధించి క్లారిటీ రావాల్సి ఉంది. ఈ స్థానాల ఎమ్మెల్యేలు అందరూ తాడేపల్లి క్యాంప్ కార్యాలయానికి వచ్చారు.
నిన్న ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస్ రెడ్డి సీఎం జగన్ ను కలిశారు. ఎంపీతో పాటు ఎమ్మెల్యే స్థానానికి సంబంధించి కీలక అంశాలు జగన్ తో చర్చించారు. కందుకూరు ఎమ్మెల్యే మహిధర్ రెడ్డి, కనిగిరి ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్ యాదవ్ తో పాటు మార్కాపురం ఎమ్మెల్యే నాగార్జున రెడ్డి.. సీఎం జగన్ ను కలిశారు. ఈ స్థానాల్లో మార్పులు చేర్పులు చేయబోతున్నారు జగన్. దీనికి సంబంధించి చర్చించారు. మార్కాపురం విషయంలో క్లారిటీ వచ్చినట్లు తెలుస్తోంది. అక్కడ మాజీ ఎమ్మెల్యే జంకె వెంకట్ రెడ్డిని కొత్త ఇంఛార్జిగా నియమించనున్నారని సమాచారం.
కందుకూరు ఎమ్మెల్యేగా మానుగుంట మహిధర్ రెడ్డి ఉన్నారు. ఆయన స్థానంలో కొత్త వారిని తీసుకురానున్నట్లు సమాచారం. ఇక కనిగిరిలో ఎమ్మెల్యేగా బుర్రా మధుసూదన్ యాదవ్ ఉన్నారు. ఈయనను కూడా మార్చే యోచనలో జగన్ ఉన్నారు. మధుసూదన్ స్థానంలో మాజీ ఎమ్మెల్యే కదిరి బాబూరావును ఇంఛార్జిగా తీసుకొచ్చే ఆలోచన చేస్తోంది వైసీపీ అధినాయకత్వం.
ఒంగోలు ఎంపీ స్థానానికి సంబంధించి ప్రధానంగా చర్చ జరుగుతోంది. ఒంగోలు ఎంపీ స్థానాన్ని మాగుంట శ్రీనివాసులు రెడ్డికి ఇవ్వాలని బాలినేని శ్రీనివాస్ రెడ్డి పట్టుబడుతున్నారు. అయితే అందుకు నో చెప్పింది వైసీపీ అధినాయకత్వం. ఇదే విషయాన్ని బాలినేనికి కూడా సీఎం జగన్ చెప్పేశారు. ఒంగోలుకి కొత్త పార్లమెంట్ ఇంఛార్జ్ ని ఎవరిని నియమించాలి? అనేదానిపై కసరత్తు చేస్తున్నారు జగన్. ఒకటి, రెండు రోజుల్లో దీనిపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతానికి అయితే ఒంగోలు ఎంపీ స్థానానికి దర్శి ఎమ్మెల్యేగా ఉన్న మద్దిశెట్టి వేణుగోపాల్ పేరు పరిశీలనలో ఉన్నట్లు సమాచారం.
Also Read : 23మంది సిట్టింగ్‌లకు నో టికెట్.. సీఎం జగన్ వారిని ఎందుకు పక్కన పెట్టారు? మార్పు వెనుక మర్మం ఏమిటి?
ఒంగోలు జిల్లాతో పాటు నరసరావుపేట పార్లమెంట్ పరిధిలో ఉన్న కొన్ని అసెంబ్లీ సెగ్మెంట్లకు సంబంధించిన మార్పులు చేర్పులపై సీఎం జగన్ కసరత్తు చేస్తున్నారు. ఇందులో భాగంగానే అంబటి రాంబాబు, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి తాడేపల్లి క్యాంప్ కార్యాలయానికి వచ్చారు. సత్తెనపల్లికి సంబంధించి కూడా మార్పులు చేర్పులు ఉంటాయని ఒక ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో దీనికి సంబంధించి క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తోంది.