YSRCP : ఆ 13 మంది ఎవరు? ఎంపీ అభ్యర్థులపై వైసీపీ ముమ్మర కసరత్తు
మొత్తంగా వైసీపీ ఇంకా 13 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. ఆ 13 స్థానాల్లో అభ్యర్థులు ఎవరు కావొచ్చు? ఎవరు పరిశీలనలో ఉన్నారు?

YSRCP Search For MP Candidates
YSRCP : గత ఎన్నికల్లో అసెంబ్లీ స్థానాలు గెలుచుకున్నట్లే రికార్డు స్థాయిలో 25 ఎంపీ స్థానాలకు గాను 22 ఎంపీలు గెలుచుకుంది అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. తాజాగా నియోజకవర్గాల ఇంఛార్జీల మార్పులు చేర్పులతో మూడు జాబితాల ప్రకటన తర్వాత గత సిట్టింగుల్లో ముగ్గురిని పక్కన పెట్టింది వైసీపీ హైకమాండ్. 9 స్థానాలకు కొత్త అభ్యర్థులను ప్రకటించింది. అలాగే 3 ఎంపీ స్థానాలకు పాత అభ్యర్థులే దాదాపుగా రంగంలోకి దిగడం ఖాయంగా కనిపిస్తోంది.
మొత్తంగా వైసీపీ ఇంకా 13 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. ఆ 13 స్థానాల్లో అభ్యర్థులు ఎవరు కావొచ్చు? ఎవరు పరిశీలనలో ఉన్నారు? ఫైనల్ ఎవరు ఖరారు కావొచ్చు? దీనికి సంబంధించి 10టీవీ ఎక్స్ క్లూజివ్ అనాలసిస్.
- ఇప్పటివరకు ఖరారైన ఎంపీ అభ్యర్థులు..
శ్రీకాకుళం – పేరాడ తిలక్
విశాఖపట్నం – బొత్స ఝాన్సీలక్ష్మి
అరకు (ఎస్టీ) – భాగ్యలక్ష్మి (ప్రస్తుం పాడేరు ఎమ్మెల్యేగా ఉన్నారు)
ఏలూరు – కారుమూరి సునీల్ కుమార్(తొలిసారి బరిలోకి, తణుకు ఎమ్మెల్యే, మంత్రి కారుమూరి నాగేశ్వరరావు కుమారుడు)
విజయవాడ – కేశినేని నాని(సిట్టింగ్ ఎంపీ, టీడీపీ వీడి వైసీపీలో చేరిక)
కర్నూలు – గుమ్మనూరు జయరాం(ఆలూరు ఎమ్మెల్యే, మంత్రిగా ఉన్నారు)
తిరుపతి – కోనేటి ఆదిమూలం (సత్యవేడు ఎమ్మెల్యేగా ఉన్నారు.. సిట్టింగ్ ఎంపీ గురుమూర్తి స్థానంలో.. గురుమూర్తి సత్యవేడు ఎమ్మెల్యేగా బరిలోకి..కుండ మార్పిడి)
హిందూపురం – జే. శాంతమ్మ (కర్నాటక మాజీ మంత్రి, జగన్ కు అత్యంత సన్నిహితుడైన శ్రీరాములుకి సోదరి.. సిట్టింగ్ ఎంపీ గోరంట్ల మాధవ్ కు టికెట్ నిరాకరణ)
అనంతపురం – శంకరనారాయణ(పెనుగొండ సిట్టింగ్ ఎమ్మెల్యే, మంత్రిగా కూడా పని చేశారు)
Also Read : 23మంది సిట్టింగ్‌లకు నో టికెట్.. సీఎం జగన్ వారిని ఎందుకు పక్కన పెట్టారు? మార్పు వెనుక మర్మం ఏమిటి?
* ముగ్గురు సిట్టింగ్ లకు టికెట్ నిరాకరణ
గోరంట్ల మాధవ్- హిందూపురం ఎంపీ
కోటగిరి శ్రీధర్ – ఏలూరు (ఎన్నికల్లో పోటీ చేయను అని 6 నెలల క్రితమే చెప్పేశారు)
డాక్టర్ సంజీవ్ కుమార్ – కర్నూలు
- మళ్లీ ఛాన్స్ దక్కించుకున్న ముగ్గురు ఎంపీలు..
* నందిగం సురేశ్ (బాపట్ల ఎస్సీ)
* పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి (రాజంపేట) జగన్ కు చేదోడు వాదోడుగా ఉన్నారు..
* వైఎస్ అవినాశ్ రెడ్డి (కడప) - 13 ఎంపీ స్థానాలకు పరిశీలనలో ఉన్న అభ్యర్థుల పేర్లు..
విజయనగరం లోక్ సభ స్థానం
* బెల్లాడ చంద్రశేఖర్ (సిట్టింగ్ ఎంపీ)
* పరిశీలనలో మంత్రి బొత్స సత్యనారాయణ, మజ్జి శ్రీనివాసరావు (మంత్రి బొత్స మేనల్లుడు) - అనకాపల్లి
* బీవీ సత్యవతి (సిట్టింగ్ ఎంపీ)
పరిశీలనలో పీలా రమాకుమారి పేరు - కాకినాడ
వంగాగీత (సిట్టింగ్ ఎంపీ)
చలమలశెట్టి సునీల్(పరిశీలనలో ఉన్న పేరు) - అమలాపురం
చింతా అనురాధ(సిట్టింగ్ ఎంపీ)
కొత్త అభ్యర్థి కోసం వేట - రాజమండ్రి
మార్గాని భరత్ – సిట్టింగ్ ఎంపీ
పరిశీలనలో ఉన్న పేర్లు.. డాక్టర్ అనుసూరి పద్మలత, వీవీ వినాయక్ - నరసాపురం
రఘురామకృష్ణరాజు (సిట్టింగ్ ఎంపీ)
పరిశీనలో ఉన్న పేర్లు.. గోకరాజు రంగరాజు(మాజీ ఎంపీ గోకరాజు గంగరాజు తనయుడు), శ్యామలాదేవి(దివంగత నటుడు కృష్ణంరాజు భార్య) - మచిలీపట్నం
బాలశౌరి(సిట్టింగ్ ఎంపీ)
పరిశీలనలో ఉన్న పేరు వంగవీటి రాధ - గుంటూరు
గల్లా జయదేవ్ (టీడీపీ సిట్టింగ్ ఎంపీ)
పరిశీనలో ఉన్న పేర్లు.. మోదుగుల వేణుగోపాల్ రెడ్డి, లావు శ్రీకృష్ణ దేవరాయలు(నరసరావుపేట ఎంపీ), సినీ నటుడు అలీ - నరసరావుపేట
లావు శ్రీకృష్ణదేవరాయలు(సిట్టింగ్ ఎంపీ)
బీసీ అభ్యర్థి కోసం అన్వేషణ - ఒంగోలు
మాగుంట శ్రీనివాసులు రెడ్డి(సిట్టింగ్ ఎంపీ)
పరిశీలనలో ఉన్న పేర్లు-చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, మద్దిశెట్టి వేణుగోపాల్ - నంద్యాల
పోచా బ్రహ్మానందరెడ్డి(సిట్టింగ్ ఎంపీ)
పరిశీలనలో ఉన్న పేరు – సినీ నటుడు అలీ - నెల్లూరు
ఆదాల ప్రభాకర్ రెడ్డి(సిట్టింగ్ ఎంపీ) (కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి స్థానంలో నెల్లూరు రూరల్ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసే అవకాశం)
పరిశీలనలో ఉన్న పేరు – వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి
Also Read : టీడీపీ రేసుగుర్రాలు రెడీ..! 72మందితో లిస్ట్..! సంక్రాంతి తర్వాత విడుదల..!