ఇది సరికాదు : సీఎం నిర్ణయం మార్చుకోవాలి – ఆర్టీసీ కార్మికులు

  • Publish Date - November 3, 2019 / 09:15 AM IST

సీఎం కేసీఆర్ ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని..ఇది సరి కాదంటున్నారు నల్గొండ ఆర్టీసీ డిపో కార్మికులు. ఏ విషయంలో క్లారిటీ ఇవ్వకుండా..విధుల్లో చేరండి అని మాట్లాడడం ఎంతవరకు కరెక్టు అని ప్రశ్నించారు. 2019, నవంబర్ 02వ తేదీ శనివారం తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్..కార్మికులకు డెడ్ లైన్ విధించారు. 2019 నవంబర్ 05వ తేదీలోగా విధుల్లో చేరాలని, లేనిపక్షంలో వారు ఉద్యోగాలు కోల్పోతారని తేల్చిచెప్పారు. దీంతో పలువురు విధుల్లో చేరేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఈ క్రమంలో నల్గొండ ఆర్టీసీ డిపోకు చెందిన కార్మికులతో 10tv మాట్లాడింది. 

డిమాండ్లను పరిష్కరించేంత వరకు నల్గొండ డిపోకు చెందిన కార్మికులు విధులకు హాజరు కాబోరని తేల్చిచెప్పారు. చట్టానికి లోబడి సమ్మె నోటీసు ఇవ్వడం జరిగిందని, కార్మికులను తప్పుదోవ పట్టించే విధంగా మాట్లాడుతున్నారని ఆరోపించారు. గత ఆరు సంవత్సరాల నుంచి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది ఏమీ లేదని..పొట్ట కాలిన తర్వాతే..కార్మికులు సమ్మెలోకి వెళుతారని, అందరి అభిప్రాయాలు తీసుకున్న తర్వాతే..యూనియన్ల నాయకులు సమ్మె పిలుపునిస్తారని వెల్లడించారు. ప్రస్తుతం ఆర్టీసీ సమ్మె ఎలాంటి పరిణామాలు సృష్టిస్తుందో చూడాలి. 
Read More : ఆన్ డ్యూటీ సర్ : కార్మికుల మరణాలకు యూనియన్ల లీడర్లే కారణం – డ్రైవర్