టీడీపీకి షాక్.. వైసీపీలోకి జయసుధ

ఎన్నికలు వస్తున్న తరుణంలో వైసీపీలోకి వలసలు జోరుగా సాగుతున్నాయి. ఈ క్రమంలో ప్రముఖ సినీ నటి జయసుధ వైసీపీలో చేరేందుకు సిద్దం అయ్యారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో సికింద్రాబాద్ అసెంబ్లీ స్థానం నుండి కాంగ్రెస్ అభ్యర్ధిగా పోటీ చేసి విజయం సాధించిన జయసుధ.. ఏడాది క్రితం ఆ పార్టీకి దూరమై తెలుగుదేశంలో చేరారు. అయితే తెలుగుదేశం కార్యక్రమాల్లో మాత్రం ఆమె ఏనాడు కూడా క్రియాశీలకంగా పాల్గొనలేదు.
Also Read : సిట్ షాకింగ్ న్యూస్ : సేవామిత్ర యాప్‌లో తెలంగాణ డేటా
అక్కడ తగిన ప్రాధాన్యత దక్కకపోవడంతో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. గురువారం సాయంత్రం జయసుధ వైసీపీ చీఫ్ జగన్‌తో భేటీ కానున్నారు. జగన్ సమక్షంలో ఆమె వైసీపీలో చేరనున్నారని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. గతంలో వైఎస్ మీద అభిమానంతో కాంగ్రెస్‌లో చేరిన జయసుధ.. అప్పట్లో జయసుధకు సికింద్రబాద్ టిక్కెట్ రావడంలో కీలకంగా వైఎస్ వ్యవహరించారు.
Also Read : జగన్ గారూ.. సైబర్ క్రైమ్ పుట్టిందే మీ ఇంట్లో!
ఇప్పుడు వైఎస్ మీద అభిమానంతోనే ఆమె వైసీపీలో చేరుతుందనే అభిప్రాయం పార్టీ వర్గాల నుంచి వినిపిస్తోంది. వైసీపీలో చేరుతున్న జయసుధ ఆ పార్టీ నుంచి పోటీ చేస్తుందా? లేదా? అనేదానిపై స్పష్టత లేదు. పోటీ చేస్తే ఎక్కడి నుంచి బరిలోకి దిగుతారు అనేది కూడా చర్చనీయాంశం అయ్యింది.
Also Read : చెక్ చేసుకోండి : మహిళల ఖాతాల్లోకి రూ.3,500 వేసిన చంద్రబాబు