Telangana Congress : వారికి నో టికెట్..! లోక్‌సభ అభ్యర్థుల ఎంపికలో కాంగ్రెస్ కీలక నిర్ణయం..!

ఎమ్మెల్సీల నియామకానికి హైకోర్టు బ్రేక్ వేయడంతో మల్కాజిగిరి నుంచి ఈటల రాజేందర్ పై కోదండరామ్ ను బరిలోకి దింపాలని యోచిస్తున్నారు.

Telangana Congress : వారికి నో టికెట్..! లోక్‌సభ అభ్యర్థుల ఎంపికలో కాంగ్రెస్ కీలక నిర్ణయం..!

Telangana Congress

Updated On : March 9, 2024 / 4:39 PM IST

Telangana Congress : లోక్ సభ ఎన్నికలపై కాంగ్రెస్ ఫోకస్ పెట్టింది. అభ్యర్థుల కోసం కాంగ్రెస్ కసరత్తు చేస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిన వారికి ఎంపీ టికెట్ ఇవ్వొద్దని అధిష్టానం భావిస్తోంది. ఇతర పార్టీలు బలమైన అభ్యర్థులను ఎంపిక చేయడంతో అభ్యర్థుల ఎంపికపై హస్తం నేతలు పునరాలోచనలో పడ్డారు. దీంతో జీవన్ రెడ్డి, సంపత్, మైనంపల్లి హన్మంతరావులకు అవకాశం లేనట్లే అని తెలుస్తోంది.

ఇప్పటికే నలుగురు ఎంపీ అభ్యర్థులను కాంగ్రెస్ ప్రకటించింది. మిగిలిన 13 మంది అభ్యర్థుల కోసం అన్వేషణ కొనసాగిస్తోంది హస్తం పార్టీ. అభ్యర్థుల ఎంపిక కోసం సునీల్ కనుగోలు టీమ్ తో సర్వేలు చేపడుతోంది. ఎమ్మెల్సీల నియామకానికి హైకోర్టు బ్రేక్ వేయడంతో మల్కాజిగిరి నుంచి ఈటల రాజేందర్ పై కోదండరామ్ ను బరిలోకి దింపాలని యోచిస్తున్నారు.

Also Read : తెలంగాణలో పోటీకి టీడీపీ, జనసేన దూరం.. ఢిల్లీ నుంచి కిషన్ రెడ్డికి పిలుపు