ఢిల్లీ : ఢిల్లీలోని ఏపీ భవన్ వద్ద సోమవారం తెల్ల వారుఝూమున ఒక వ్యక్తి మృత దేహాన్ని ఏపీ భవన్ సిబ్బంది గుర్తించారు. వెంటనే వారు పోలీసులకు సమాచారం అందించారు. మరణించిన వ్యక్తిని శ్రీకాకుళం జిల్లాకు చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. చక్రాల కుర్చీలో మృతిచెంది ఉన్న అతనివద్దనుంచి ఒక లేఖను, 20 రూపాయల నోటు, పక్కనే చిన్నబాటిల్ ను పోలీసులుస్వాధీనం చేసుకున్నారు.
అనుమానాస్పద మృత దేహాన్నిరామ్ మనోహర్ లోహియా ఆసుపత్రికి తరలించారు. పురుగుల మందు తాగి సూసైడ్ చేసుకుని ఉండవచ్చని భావిస్తున్నారు. లేఖలో ఏమున్నదనేది ఇంకా తెలియలేదు. పోలీసులు లేఖను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. మరో వైపు సోమవారం ఉదయం నుంచి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ధర్మ పోరాట దీక్ష చేపడుతున్న సమయంలో వ్యక్తి సూసైడ్ చేసుకోవటంతో కొంత కలకలం రేగింది.