Pawan Kalyan : పొత్తును తక్కువ అంచనా వేయొద్దు, అన్ని సీట్లు వచ్చుంటే నేనే సీఎం- పవన్ కల్యాణ్
Pawan Kalyan: ఎంఐఎంలా కనీసం 7 స్థానాలు కూడా గెలిపించలేదు. ఏపీ అభివృద్ధి కోసం కొందరికి శత్రువు అవ్వడానికి కూడా సిద్దంగా ఉన్నా. ముందస్తు ఎన్నికలు వస్తే జూన్ నుండి సిద్దంగా ఉంటాం.

Pawan Kalyan, KCR (Photo : Google, Twitter)
Pawan Kalyan On Political Alliance : ఎన్నికల్లో పొత్తులను తక్కువ అంచనా వేయొద్దని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. పార్టీ ఎదుగుదలకి పొత్తు ఎంతగానో దోహదపడుతుందన్నారు. పొత్తుల వల్ల పార్టీ బలపడుతుందన్నారు. అందుకు, బీఆర్ఎస్ పార్టీ చక్కటి ఉదాహరణ అన్నారు.
ఏపీ అభివృద్ధి కోసం తాను కొందరికి శత్రువు అవ్వడానికి కూడా సిద్దంగా ఉన్నానన్నారు పవన్ కల్యాణ్. తనను అనేకొద్ది మరింత రాటుదేలుతుంటా అన్నారు. గత ఎన్నికల్లో జనసేనకు 40 సీట్లు వచ్చి ఉంటే సీఎం పదవి వచ్చి ఉండేదన్నారు పవన్ కల్యాణ్.
Pawan Kalyan : టీడీపీ, బీజేపీ, జనసేన కలిసే పోటీ- పొత్తులపై పవన్ కల్యాణ్ కీలక ప్రకటన
” కష్టాలు వస్తే పవన్ గుర్తొస్తాడు. ఓట్లు వేసేటప్పుడు గుర్తు రావడం లేదు. టీడీపీ నాయకులను సీఎం చెయ్యడానికి జనసేన లేదు. కానీ, మన బలం ఎంత ఉందో బేరీజు వేసుకోవాలి. జనం రావడం కాదు. వచ్చిన జనం ఓట్లుగా మార్చుకోగలగాలి. అవసరమైనప్పుడు తగ్గడం, అవసరమైనప్పుడు తిరగబడడం ఉండాలి.
ఎంఐఎంలా కనీసం 7 స్థానాలు కూడా గెలిపించలేదు. 2009లో వచ్చిన 18 స్థానాలు కూడా గెలిపించలేదు. సీఎం అభ్యర్థిగా ఉంటేనే పొత్తు అని మాట్లాడకూడదు. 2014లో సపోర్ట్ చేసింది సమయం లేక. అందువల్ల కొందరు సీఎం, కొందరు ఎమ్మెల్యే, ఎంపీలు అయ్యారు. ఆనాడు పదవులు ఇస్తామని అన్నారు. కానీ తీసుకోలేదు” అని పవన్ అన్నారు.
Also Read..Pawan Kalyan : ఏపీ కోసం పవన్ ప్రకటన హర్షణీయం .. వాస్తవాలకు దగ్గరగా ఉన్నాయి : మాజీ మంత్రి
” సీఎం జగన్ సకలకళా కోవిదులు. నన్ను తిట్టే బుడతలను సీఎం అభ్యర్థిగా ప్రకటించండి. మా పార్టీ గురించి మీకెందుకు..? జనసేన మీకు ఎందుకూ పనికి రాని పార్టీ కదా వదిలెయ్యండి. టీడీపీని అయినా వదిలేస్తున్నారు. కానీ జనసేను వదలడం లేదు. జనసేన అంటే మీకు భయం ఉంది. పొత్తును తక్కువ అంచనా వేయకండి. పార్టీ ఎదుగుదలకి పొత్తు దోహదపడుతుంది. పొత్తుల వల్ల బలపడతాము అనేదానికి బీఆర్ఎస్ పార్టీ ఉదాహరణ. రాజకీయాల్లో వ్యూహాలే ఉంటాయి. వ్యూహం చాలా కీలకం.
ముందస్తు ఎన్నికలు వస్తే జూన్ నుండి సిద్దంగా ఉంటాం. కాపులకు రిజ్వేషన్లు ఇవ్వనని జగన్ ఛీకొట్టారు. మరెందుకు జగన్ కి కాపులు ఓట్లు వేశారు? కాపు నాయకులు నిలదీయాల్సిది జగన్ ను. నన్ను కాదు. కాపుల మధ్య గొడవలు పెడుతున్నారు. కావాలని ఎస్సీ, ఎస్టీ కేసులు పెట్టిస్తున్నారు. కక్ష కట్టి భీమ్లా నాయక్ సినిమా ఆపేశారు. రూ.30కోట్ల నష్టం వచ్చింది. కాపులను చంద్రబాబు దగ్గర తాకట్టు పెట్టామంటున్నారు. కాపులేమైనా చిన్నపిల్లలా?” అని పవన్ కల్యాణ్ ప్రశ్నించారు.