పంచాయతీ ఎన్నికలు : గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు 

  • Published By: veegamteam ,Published On : January 6, 2019 / 02:31 PM IST
పంచాయతీ ఎన్నికలు : గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు 

హైదరాబాద్ : తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికలకు రంగం సిద్ధమైంది. రాష్ట్రంలో మూడు విడతలుగా పంచాయతీ ఎన్నికలు జరుగనున్నాయి. రాష్ట్ర ఎన్నికల సంఘం ఎన్నికల తేదీలను ప్రకటించింది. జనవరి 21, జనవరి 25, జనవరి 30 తేదీల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు. గుర్తులను కూడా వెల్లడించారు. ఎన్నికల నిర్వహణకు అధికారులు అన్ని ఏర్పాట్లను చేస్తోన్నారు. బ్యాలెట్ పేపర్ పద్ధతిలో ఎన్నికలు జరుగనున్నాయి. బ్యాలెట్ పేపర్ లో నోటా ఉంటుంది.

పంచాయతీ ఎన్నికల సందర్భంగా రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యాలయంలో గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు చేయనున్నారు. ఓటర్ల సందేహాలు, ఫిర్యాదుల కోసం గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు చేస్తున్నట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం తెలిపింది. ఫిర్యాదులకు సంప్రదించాల్సిన నెంబర్ 040-29802895