Maharashtra Politics: నాక్ చెక్ పెడుతున్నారు.. సీఎం మార్పుపై ఎట్టకేలకు పెదవి విప్పిన మహా సీఎం షిండే
సీఎం షిండే స్వస్థలమైన థానేలో ఓ సంస్థ గ్రాండ్ మాస్టర్ విశ్వనాథ్ ఆనంద్ చెస్ పోటీలను నిర్వహించింది. ముందుగా ఈ కార్యక్రమానికి సీఎం అభినందన సందేశం ఇచ్చారు. తరువాత, మహారాష్ట్ర రాజకీయాల్లో కొనసాగుతున్న చర్చ గురించి షిండే మాట్లాడుతూ..

Eknath Shinde: గత కొద్ది రోజులుగా మహారాష్ట్ర ముఖ్యమంత్రిని మార్చేయనున్నట్లు చర్చ జరుగుతోంది. ఈ విషయంపై బహిరంగంగానే చర్చ జరుగుతున్నప్పటికీ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే మాత్రం మౌనం పాటిస్తూ వచ్చారు. ఇక ఎట్టకేలకు దీనిపై బుధవారం తొలిసారి పెదవి విప్పారు. ముఖ్యమంత్రిని మార్చే ప్రయత్నం జరుగుతోందని ఆయన ఒప్పుకున్నారు. ఏడాది కాలంగా తనకు చెక్ పెట్టేందుకు అనేక ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన వ్యాఖ్యానించడం విశేషం. షిండే స్పందనతో ఇంతకీ షిండే ఎవరిని టార్గెట్ చేసిన ఈ వ్యాఖ్యలు చేశారని మరో చర్చ పైకి లేసింది.
Pinipe Viswarupu: పినిపే విశ్వరూప్ లక్ష్యంగా పావులు కదుపుతున్న ప్రత్యర్థులు
సీఎం షిండే స్వస్థలమైన థానేలో ఓ సంస్థ గ్రాండ్ మాస్టర్ విశ్వనాథ్ ఆనంద్ చెస్ పోటీలను నిర్వహించింది. ముందుగా ఈ కార్యక్రమానికి సీఎం అభినందన సందేశం ఇచ్చారు. తరువాత, మహారాష్ట్ర రాజకీయాల్లో కొనసాగుతున్న చర్చ గురించి షిండే మాట్లాడుతూ.. ‘‘గత ఏడాది కాలంగా చాలా మంది నన్ను చెక్‌మేట్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. కానీ వారి కల నెరవేరడం లేదు’’ అని అన్నారు.
ప్రత్యర్థులు తమ తెలివితేటలను ఉపయోగించారని, అయితే ప్రజల విశ్వాసం, మద్దతు తనకెంతో ఉందని, అందుకే ప్రత్యర్థులు వెన్నుపోటు పొడవాలని చూసినా వర్కౌట్ కావడం లేదని సీఎం ఏక్‌నాథ్ షిండే అన్నారు. షిండే తన ప్రకటనలో ఏ ప్రతిపక్ష పార్టీని, వర్గాన్ని ప్రస్తావించకుండా విమర్శలు గుప్పించారు. మహారాష్ట్ర ప్రభుత్వంలోకి అజిత్ పవార్ ప్రవేశంపై సీఎం షిండే ఆగ్రహంగా ఉన్నారని మీడియా కథనాలు వచ్చిన విషయం మీకు తెలిసిందే. ఫడ్నవీస్, అజిత్ పవార్ కలిసి షిండేను టార్గెట్ చేశారా అనే ప్రశ్నలు లేవనెత్తాయి.