Karnataka: బీజేపీ వైపు బెంగళూరు మాజీ పోలీస్ బాస్ చూపు.. తొందరలోనే ఆప్‭కు టాటా

బసవనగుడి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఆప్ అభ్యర్థిగా భాస్కర్ రావు నిలబడతారని పెద్ద ఎత్తున చర్చ జరిగింది. అయితే రాష్ట్ర యూనిట్‌లోని కొంతమంది నాయకులతో ఆయన అంతగా సఖ్యతగా లేరట. పార్టీ ఇటీవలి సంస్థాగత మార్పుల కారణంగా పార్టీని విడిచిపెట్టాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం.

Karnataka: ఇంకో ఆరు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపధ్యంలో కర్ణాటక రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు రసవత్తరంగా మారుతున్నాయి. ఆమ్ ఆద్మీ పార్టీకి మేనిఫెస్టో కమిటీ చైర్మన్‭గా ఉన్న బెంగళూరు మాజీ పోలీస్ కమిషనర్ భాస్కర్ రావు తొందరలోన పార్టీ మారనున్నట్లు తెలుస్తోంది. ఆయన చూపు అధికార భారతీయ జనతా పార్టీ వైపు చూస్తున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. రెవెన్యూ మంత్రి ఆర్ అశోకతో తాజాగా ఆయన చర్చలు సాగించినట్లు, ఆ చర్చలు సఫలం కావడంతో తొందరలోనే ఆయన కమల తీర్థం పుచ్చుకోనున్నట్లు వార్తలు బలంగా వినిపిస్తున్నాయి.

Dog Kills Infant : దారుణం.. ప్రభుత్వ ఆసుపత్రిలో తల్లి పక్కన పడుకున్న పసికందును చంపేసిన కుక్కలు

తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు కే.అన్నామలై, కేంద్ర ప్రహ్లాద్ జోషిలను సైతం ఆయన కలుసుకుని చర్చలు చేసినట్లు తెలుస్తోంది. అన్నామలై కర్ణాటక రాష్ట్రానికి పోల్స్ ఇంచార్జిగా వ్యవహరిస్తున్నారు. పోయిన ఏడాది తన ఐపీఎస్ పదవికి రాజీనామా చేసి ఆమ్ ఆద్మీ పార్టీలో చేరారు భాస్కర్ రావు. ఇక ఈ మధ్యనే ఆయనను మేనిఫెస్టో కమిటీకి చైర్మన్ గా నియమించారు. దీంతో రాష్ట్రంలో ఆప్‭కు ముఖ్యమైన ఒకటిగా భాస్కర్ రావు మారారు.

Doctor Mazharuddin : అసదుద్దీన్ ఒవైసీ వియ్యంకుడు డాక్టర్ మజారుద్దీన్ ఆత్మహత్యకు కారణం అదేనా?

బసవనగుడి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఆప్ అభ్యర్థిగా భాస్కర్ రావు నిలబడతారని పెద్ద ఎత్తున చర్చ జరిగింది. అయితే రాష్ట్ర యూనిట్‌లోని కొంతమంది నాయకులతో ఆయన అంతగా సఖ్యతగా లేరట. పార్టీ ఇటీవలి సంస్థాగత మార్పుల కారణంగా పార్టీని విడిచిపెట్టాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం.

ట్రెండింగ్ వార్తలు