Doctor Mazharuddin : అసదుద్దీన్ ఒవైసీ వియ్యంకుడు డాక్టర్ మజారుద్దీన్ ఆత్మహత్యకు కారణం అదేనా?

హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ వియ్యంకుడు డాక్టర్ మజారుద్దీన్ అలీ ఖాన్ ఆత్మహత్యపై పోలీసుల విచారణ కొనసాగుతోంది. సోమవారం మజారుద్దీన్ తన లైసెన్స్డ్ రివాల్వర్ తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన క్లూస్ టీమ్ ఆధారాలు సేకరించింది. మజారుద్దీన్ అలీ ఖాన్ ఆత్మహత్యకు కుటుంబ కలహాలే కారణంగా పోలీసులు భావిస్తున్నారు.

Doctor Mazharuddin : అసదుద్దీన్ ఒవైసీ వియ్యంకుడు డాక్టర్ మజారుద్దీన్ ఆత్మహత్యకు కారణం అదేనా?

Doctor Mazharuddin : హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ వియ్యంకుడు డాక్టర్ మజారుద్దీన్ అలీ ఖాన్ ఆత్మహత్యపై పోలీసుల విచారణ కొనసాగుతోంది. సోమవారం (ఫిబ్రవరి 27,2023) మజారుద్దీన్ తన లైసెన్స్డ్ రివాల్వర్ తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన క్లూస్ టీమ్ ఆధారాలు సేకరించింది. మజారుద్దీన్ అలీ ఖాన్ ఆత్మహత్యకు కుటుంబ కలహాలే కారణంగా పోలీసులు భావిస్తున్నారు. కర్మాన్ ఘాట్ లోని ఒవైసీ ఆసుపత్రి పరిశోధనా విభాగంలో ఆర్ధోపెడిక్ సర్జన్ గా మజారుద్దీన్ అలీ ఖాన్ విధులు నిర్వహిస్తున్నారు.

బంజారాహిల్స్ ఎమ్మెల్యే కాలనీ హనుమాన్ స్ట్రీట్ లోని ఇంట్లో డాక్టర్ మజారుద్దీన్ దంపతులు నివాసం ఉంటున్నారు. మూడు నెలలుగా మజారుద్దీన్ దంపతుల మధ్య కుటుంబ, ఆర్ధిక వివాదాలు నడుస్తున్నాయి. ఆస్తి పంపకాలపై పరస్పరం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదులు చేసుకున్నారు. ఆస్తి తగాదాలు తార స్థాయికి చేరడంతో మజారుద్దీన్ భార్య ముంబైకి వెళ్లిపోయింది. మూడు నెలల క్రితం తిరిగి హైదరాబాద్ కు వచ్చింది.

Also Read..Mobile Phone Explosion : బాబోయ్.. బాంబులా పేలిన మొబైల్ ఫోన్..! తీవ్ర గాయాలతో వృద్ధుడు మృతి

ఇంట్లోకి తనను అనుమతించాలంటూ న్యాయస్థానాన్ని ఆమె ఆశ్రయించింది. కోర్టు ఆదేశాలతో భార్య, భర్తలిద్దరూ అదే ఇంట్లో నివాసం ఉంటున్నారు. సోమవారం ఉదయం తన భార్యతో కలిసి బయటకు వెళ్లి వచ్చారు మజారుద్దీన్. అనంతరం తన గదికి వెళ్లి తలుపులు వేసుకున్నారు. ఉదయం 6 గంటలకు ఆయన గదికి పని మనిషి వెళ్లింది. తాను నిద్రపోతానని 10 గంటలకు లేపమని మజార్ పనిమనిషిని వెనక్కి పంపారు.

11 గంటలు అవుతున్నా ఆయన గదిలో ఎలాంటి అలికిడి లేకపోవడంతో పనిమనిషి కిటికీలోంచి గదిలోకి చూసింది. అనుమానం వచ్చి భార్యకు సమాచారం ఇచ్చింది. ఆమె పరిశీలించి రెండో కుమారుడికి ఫోన్ చేసి పిలిపించింది. గది కిటికీ ద్వారా రెండో కుమారుడిని లోపలికి పంపారు. గదిలో మంచంపై రక్తపుమడుగులో పడున్న మజార్ ను చూసి షాక్ అయ్యాడు. ఆ వెంటనే ఆయనను జూబ్లీహిల్స్ అపోలో ఆసుపత్రికి తరలించారు.

Also Read..Cyber Cheaters : టెలిగ్రామ్ యూజర్లకు యువతులను ఎరవేసి ట్రాప్.. కోట్ల రూపాయలు కాజేస్తున్న సైబర్ చీటర్స్

అయితే, అప్పటికే అలీ ఖాన్ మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. సమాచారం అందుకున్న బంజారాహిల్స్ పోలీసులు క్లూస్ టీమ్స్ అక్కడికి చేరుకుని ఆధారాలు సేకరించాయి. ఒక రౌండ్ కాల్పులు జరిగినట్లు ప్రాథమికంగా అంచనా వేశారు పోలీసులు. మృతుడి కుటుంబసభ్యుల మధ్య ఆస్తి తగాదాలు ఉన్నాయని పోలీసులు వెల్లడించారు. మృతుడిపై గృహహింస కేసు కూడా ఉందని వెల్లడించారు. పోలీసులు అన్ని కోణాల్లో ఈ కేసుని దర్యాఫ్తు చేస్తున్నారు.

Also Read..Bairi Naresh : బైరి నరేశ్‌పై మరోసారి దాడి.. పోలీస్ వాహనంలో ఉండగానే చితక్కొట్టారు

2020లో ఒవైసీ రెండో కుమార్తెతో మజార్ కొడుకు అలీఖాన్ కు వివాహం జరిగింది. దంపతుల మధ్య విబేధాలు తారస్థాయికి చేరడంతో డాక్టర్ మజారుద్దీన్ ఒత్తిడికి గురైనట్లు పోలీసుల విచారణలో వెలుగుచూసింది.