Dog Kills Infant : దారుణం.. ప్రభుత్వ ఆసుపత్రిలో తల్లి పక్కన పడుకున్న పసికందును చంపేసిన కుక్కలు

నెల వయసున్న పసికందును వీధి కుక్కలు కిరాతకంగా కరిచి చంపేశాయి. సిరోహి జిల్లాలో ఈ దారుణం జరిగింది. ప్రభుత్వ ఆసుపత్రిలో సిబ్బంది ఎవరూ లేని సమయంలో తల్లి పక్కన పడుకున్న ఆడ శిశువును రెండు కుక్కలు ఎత్తుకెళ్లాయి. అర్థరాత్రి 2 గంటల సమయంలో తల్లి నిద్ర లేవగానే కూతురు కనిపించలేదు. దీంతో కంగారుపడిన తల్లి.. బయటకు వచ్చి చూడగా కుక్కలు కరుస్తుండటం కంటబడింది. కుక్కలను తరిమేసినా పసికందు ప్రాణం దక్కలేదు.

Dog Kills Infant : దారుణం.. ప్రభుత్వ ఆసుపత్రిలో తల్లి పక్కన పడుకున్న పసికందును చంపేసిన కుక్కలు

Dog Kills Infant : హైదరాబాద్ అంబర్‌పేట్‌లో నాలుగేళ్ల చిన్నారిని వీధి కుక్కలు దాడి చేసి చంపేసిన ఘటన తీవ్ర కలకలం రేపింది. అభంశుభం తెలియని బాలుడు వీధి కుక్కల దాడిలో తీవ్రంగా గాయపడి విలవిలలాడుతూ ప్రాణాలు కోల్పోయాడు. ఈ హృదయ విదారక ఘటన సర్వత్రా ఆందోళన నింపింది. తాజాగా అలాంటి ఘోరం ఒకటి రాజస్తాన్ లో చోటు చేసుకుంది. ఆసుపత్రిలో తల్లి పక్కన పడుకుని ఉన్న పసికందుని ఎత్తుకెళ్లి చంపేశాయి వీధి కుక్కలు.

నెల వయసున్న పసికందును వీధి కుక్కలు కిరాతకంగా కరిచి చంపేశాయి. సిరోహి జిల్లాలో ఈ దారుణం జరిగింది. ప్రభుత్వ ఆసుపత్రిలో సిబ్బంది ఎవరూ లేని సమయంలో తల్లి పక్కన పడుకున్న ఆడ శిశువును రెండు కుక్కలు ఎత్తుకెళ్లాయి. అర్థరాత్రి 2 గంటల సమయంలో తల్లి నిద్ర లేవగానే కూతురు కనిపించలేదు. దీంతో కంగారుపడిన తల్లి.. బయటకు వచ్చి చూడగా కుక్కలు కరుస్తుండటం కంటబడింది. కుక్కలను తరిమేసినా పసికందు ప్రాణం దక్కలేదు.

Also Read..Cases of dog bites: వీధిలో పిచ్చి కుక్క బీభత్సం.. 10 మందికి గాయాలు

ఆసుపత్రిలోని టీబీ వార్డులో నెల వయసున్న పసికందు తన తల్లి పక్కనే పడుకుని ఉంది. ఇంతలో రెండు కుక్కలు ఆసుపత్రిలోనికి వచ్చాయి. టీబీ వార్డులోకి వెళ్లాయి. ఒక కుక్క పసికందును నోట కరుచుకుని బయటకు వచ్చింది. ఆ తర్వాత బయటకు తీసుకెళ్లి కరిచి చంపేశాయి. రెండు కుక్కలు ఆసుపత్రిలోనికి వెళ్లడం, ఓ కుక్క పసికందుని బయటకు ఎత్తుకెళ్లడం ఇదంతా ఆసుపత్రిలోని సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయ్యింది.

పసికందు తండ్రి టీబీ చికిత్స కోసం ఆసుపత్రిలో చేరాడు. అతడికి సాయంగా ఉండేందుకు అతడి భార్య, తన పసికందుతో వచ్చింది. పసికందును తన పక్కన పడుకోబెట్టుకున్న తల్లి.. ఆమె కూడా నిద్రలోకి జారుకుంది. దీంతో కుక్కల తన బిడ్డను ఎత్తుకెళ్లిన విషయం ఆమెకు తెలియదు. కాగా, కుక్కలు పసికందును ఎత్తుకెళ్లే సమయంలో అక్కడ ఆసుపత్రి సిబ్బంది కూడా ఎవరూ లేరు. దీంతో ఈ ఘోరం జరిగిపోయింది.

Also Read..Dog Bite Control Guidelines: అంబర్‌పేట ఘటనపై ప్రభుత్వం సీరియస్.. కుక్క కాటు నియంత్రణకు మార్గదర్శకాలు జారీ

ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. దీనిపై ఆసుపత్రి యాజమాన్యం విచారణకు ఆదేశించింది. “రోగి అటెండర్ నిద్రిస్తున్నారు. ఇక ఆసుపత్రి గార్డు ఇతర వార్డుకు హాజరయ్యాడు. నేను CCTV ఫుటేజీ చూడలేదు. విచారణ తర్వాత మాత్రమే నేను మాట్లాడగలను” అని సిరోహి జిల్లా ఆసుపత్రి ప్రిన్సిపల్ మెడికల్ ఆఫీసర్ వీరేంద్ర చెప్పారు.

ఇక హైదరాబాద్ విషయానికి వస్తే.. అంబర్ పేట్ లో జరిగిన దారుణం మరుకవ ముందే.. నాచారం పోలీస్ స్టేషన్ పరిధిలో మరో వీధి కుక్కల దాడి ఘటన తెరపైకి వచ్చింది. మల్లాపూర్ గ్రీన్ హిల్స్ కాలనీలో ఆడుకుంటున్న బాలుడిపై వీధికుక్కలు దాడికి ప్రయత్నించాయి. అయితే బాలుడు చాకచక్యంగా వీధికుక్కల దాడి నుంచి తప్పించుకున్నారు. ఈ ఘటనలో బాలుడు స్వల్ప గాయాలతో బయటపడ్డాడు.

వీధి కుక్కల దాడులు పెరిగిపోతుండటం ఆందోళనకు గురి చేస్తోంది. రోడ్డు మీదకు రావాలంటేనే భయపడే పరిస్థితి నెలకొంది. మరీ ముఖ్యంగా పిల్లల తల్లిదండ్రులు బాగా భయపడుతున్నారు. తమ పిల్లల క్షేమం గురించి కంగారుపడుతున్నారు. ఎప్పుడు ఎటువైపు నుంచి ఏ కుక్క వచ్చి దాడి చేస్తుందోనని హడలిపోతున్నారు. ఇది ఏదో ఒక ప్రాంతంలో ఉన్న సమస్య కాదు. దాదాపు అన్ని చోట్లా ఇదే ప్రాబ్లమ్. వీధి కుక్కలు పెద్ద సమస్యగా మారాయి. విచక్షణారహితంగా దాడి చేయడమే కాదు చుట్టుముట్టి కరిచి చంపేస్తుండటం ఆందోళనకు గురి చేసే అంశం. దీనిపై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలని, వీధి కుక్కల సమస్యను పరిష్కరించాలనే డిమాండ్ సర్వత్రా వ్యక్తమవుతోంది.