విశాఖపట్నాన్ని పరిపాలనా రాజధాని( Executive Capital) గా సీఎం జగన్ అనుకున్నదగ్గర నుంచి నగరం రూపురేఖలు మారిపోతున్నాయి. ఏపీ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గా రూపోందుతున్న విశాఖ మహానగంలో ట్రాఫిక్ రద్దీ తగ్గించేందుకు నగరంల మరో 4 ఫ్లై ఓవర్ల నిర్నించేందుకు జీవీఎంసీ సిధ్దమైంది. ఇప్పటికే ఆర్థిక రాజధానిగా.. ఆపై అంతర్జాతీయ కార్యక్రమాలకు విశాఖ వేదికగా మారింది. జనాభా కూడా పెరుగుతోంది.
ఇక ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ పని చేయం మొదలెడితే నగరంలో రద్దీ ఎన్నో రెట్లు పెరిగే అవకాశం ఉంది.వాహనాలరాకపోకలు పెరుగుతాయి. ట్రాఫిక్ పద్మ వ్యూహాన్ని తలపిస్తుంది. నగరంలో ఇప్పుడున్న రోడ్లు, జంక్షన్లు ఇరుకై పోతాయి. భవిష్యత్తులో ఎదురయ్యే ట్రాఫిక్ సమస్యలు దృష్టిలో పెట్టుకుని దానికి చెక్ పెట్టేందుకు జీవీఎంసీ నాలుగు ఫ్లై ఓవర్లు నిర్మించాలని తలపెట్టింది. అందుకోసం ఆసక్తి గల సంస్ధలనుంచి డీపీఆర్ లు సిధ్దం చేసేందుకు టెండర్లు పిలిచింది. ఫిబ్రవరి 28 లోగా బిడ్స్ ఇవ్వాలని జీవీఎంసీ సూచించింది.
645 కిలోమీటర్లలో విస్తరించిన మహా విశాఖ నగరంలో ఇప్పటికే 22.44 లక్షల జనాభా ఉన్నారు. భవిష్యత్తులో ఈ సంఖ్య మరింత పెరగనుంది. దీంతో పెరిగే ట్రాఫిక్ నుంచి ప్రజలను బయట పడేసేందుకు నగరంలో ఫ్లై ఓవర్ల నిర్మాణం చేపట్టనుంది. పాతగాజువాక, మద్దిలపాలెం, హనుమంతవాక, కార్ షెడ్ ఏరియాల్లో ప్రస్తుతం జీవీఎంసీ ఫ్లై ఓవర్లు నిర్మించాలని తలపెట్టింది. మరోవైపు గోపాలపట్నం వద్ద ఆర్ఓబీ నిర్మాణానికి ప్రణాళికలు రూపోందిస్తోంది.
ప్రస్తుతం నగరంలోని అత్యంత రద్దీ సెంటరైన ఎన్ఏడీ జంక్షన్ వద్ద ఒక ఫ్లై ఓవర్ నిర్మాణంలో ఉంది. వీఎంఆర్డీఏ దీన్ని నిర్మిస్తోంది. ఇది పూర్తయితే ఇక్కడ ట్రాఫిక్ సమస్య తీరినట్లే. ఇక మిగిలిన చోట్ల కూడా ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు ఎన్.హెచ్-16 పై ఎక్కువ రద్దీ ఉన్న జంక్షన్లను గుర్తించి ఆప్రాంతంలో నాలుగు లైన్ల్ ఫ్లై ఓవర్లు నిర్మాణం చేపట్టనుంది. దీంతో పాటు గోపాలపట్నం వద్ద ఒక రైల్ ఓవర్ బ్రిడ్జి నిర్మించనున్నారు. దీని సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్) సిధ్ధం చేసేందుకు ఇప్పుడు టెండర్లు పిలిచారు.
రాగల దశాబ్ద కాలంలో పెరిగే ట్రాఫిక్ ను దృష్టిలో ఉంచుకుని రెండు దశల్లో డీపీఆర్ తయారు చేయిస్తున్నారు. ఫేజ్ 1 లో సాధ్యాసాధ్యాలు..గంటకు ఒక్కోవైపు నుంచి వెళ్లే వాహానాల రద్దీ, ఆయా ప్రాంతాల్లో భూసార పరీక్షలు, అంచనా వ్యయంతో నివేదిక సిధ్ధం చేయిస్తున్నారు. అదేవిధంగా జియోటెక్ రిపోర్టు, డిజైన్లు తుది భూసార పరీక్షల నిర్వహణ, ఆర్ధిక స్థితిగతులు లెక్కించటం, ఎంత ఖర్చుఅవుతుంది వంటి వివరాలతో రెండో డీపీఆర్ సిధ్ధం చేస్తున్నారు. నగరంలో నిర్మించే మెట్రో రైలు నిర్మాణం ప్రతిపాదన కూడా పరిగణలోకి తీసుకుని..నగరంలో నుంచి వెళ్లే 40 కిలోమీటర్ల జాతీయ రహాదారిపై ఉన్న ట్రాఫిక్ జంక్షన్లను దృష్టిలో ఉంచుకుని డీపీఆర్ లు సిధ్ధం చేస్తున్నారు.