మేమంతా మీవెంటే.. సైన్యం ఆత్మస్థైర్యంతో ముందుకెళ్తోంది : మోడీ

  • Publish Date - September 14, 2020 / 10:44 AM IST

కరోనా నిబంధనలు పాటిస్తూ పార్లమెంట్ సమావేశాలు కొనసాగనున్నాయి. పార్లమెంట్ సమావేశాలకు హాజరయ్యే ముందు ప్రధాని నరేంద్ర మోడీ మీడియాతో మాట్లాడారు.. కరోనా పరిస్థితుల్లో పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయని చెప్పారు. తొలిసారి రాజ్యసభ, లోక్ సభ సమావేశాలు వేర్వేరుగా జరుగుతున్నాయని అన్నారు. సరిహద్దుల్లో పరిస్థితులను ఎదుర్కొనేందుకు భారత్ సిద్ధంగా ఉందని తెలిపారు.



సైన్యం ఆత్మస్థైర్యంతో ముందుకెళ్తోందని మోడీ అన్నారు. కరోనా వ్యాక్సిన్ తయారీలో మన శాస్త్రవేత్తలు విజయవంతం అవుతారని ప్రధాని మోడీ ఆకాంక్షించారు. పార్లమెంట్ సమావేశాలు ప్రత్యేక పరిస్థితుల్లో జరుగుతున్నాయని చెప్పారు. అందరూ బాధ్యతాయతంగా వ్యవహరించాలన్నారు. చైనా ఎత్తులను ఎదుర్కొనేందుకు భారత్ సిద్ధంగా ఉందన్నారు. దేశ సరిహద్దుల వద్ద సైన్యం ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉందన్నారు.



https://10tv.in/pm-modis-mann-ki-baat-video-gets-over-5-lakh-dislikes-on-youtube-amid-outrage-over-neet-jee/
సరిహద్దుల్లో చైనా వివాదంపై ఆయన ధీటైన సందేశాన్ని ఇచ్చారు.. పార్లమెంట్, సభలోని సభ్యులందరూ ఏకమై దేశంతోపాటు తామంతా సైన్యంతోనే ఉన్నామనే సందేశాన్ని ఇస్తారని ఆశిస్తున్నానని చెప్పారు. మాతృభూమిని రక్షించుకునేందుకు సరిహద్దుల్లో అక్కడ మన సైన్యం అత్యంత ధైర్యసాహసాలతో ప్రాణాలను ఎదురొడ్డి పోరాడుతున్నాయి.



కొన్నిరోజులుగా సరిహద్దుల్లో భారీ మంచు కురుస్తోంది.. అనుకూల వాతావరణం లేని గడ్డు పరిస్థితుల్లోనూ సైన్యం ధైర్యంగాపోరాడుతోంది. అదే తరహాలో పార్లమెంట్ కూడా గట్టి సందేశాన్నిస్తుందనే విశ్వాసం ఉంది. తాను మీ వెనుక ఉన్నాననే ఒక గొంతు వినిపించినా చాలు.. సరిహద్దుల్లో సైన్యం మరింత ఉత్సహంతో ధైర్యంతో ముందుకు వెళ్తుందని ప్రధాని మోడీ సందేశమిచ్చారు.