ఉమ్మడి రాజధాని హైదరాబాద్.. వైవీ సుబ్బారెడ్డి వ్యాఖ్యలపై రాజకీయ రచ్చ

ఎన్నికల వేళ హైదరాబాద్ పై ఒకే పార్టీ చెందిన ఇద్దరు కీలక నాయకులు చెరో రకంగా స్పందించడాన్ని ఎలా చూడాలి?

ఉమ్మడి రాజధాని హైదరాబాద్.. వైవీ సుబ్బారెడ్డి వ్యాఖ్యలపై రాజకీయ రచ్చ

Hyderabad Joint Capital

Hyderabad Joint Capital : ఏపీ ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ను మరికొంత కాలం కొనసాగించాలంటూ వైసీపీ సీనియర్ నేత వైవీ సుబ్బారెడ్డి చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా కలకలం రేపాయి. అయితే, ఉమ్మడి రాజధాని వ్యాఖ్యలపై మంత్రి బొత్స సత్యనారాయణ స్పందించారు. హైదరాబాద్ ఉమ్మడి రాజధాని అనేది తమ పార్టీ విధానం కాదని, వైవీ సుబ్బారెడ్డి వ్యాఖ్యలను వక్రీకరించారని మంత్రి బొత్స అన్నారు. పదేళ్ల తర్వాత ఉమ్మడి రాజధాని సాధ్యం కాదన్నారు. ఏది ఏమైనా వైవీ వ్యాఖ్యలతో ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాజధాని అంశం మరోసారి తెరపైకి వచ్చింది.

Also Read : ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్‌.. వైవీ సుబ్బారెడ్డి వ్యాఖ్యల వెనుక పక్కా ప్లాన్?

రాజధానిపై కన్ ఫ్యూజన్ క్రియేట్ చేసి లబ్ది పొందాల్సిన అవసరం తమ ప్రభుత్వానికి లేదన్నారు బొత్స. అనుభవం ఉన్న నేతలెవరూ రాజధానిపై ఇలాంటి వ్యాఖ్యలు చేయరన్నారు. ఎన్నికల వేళ హైదరాబాద్ పై ఒకే పార్టీ చెందిన ఇద్దరు నాయకులు చెరో రకంగా స్పందించడాన్ని ఎలా చూడాలి? వైవీ సుబ్బారెడ్డి, బొత్స సత్యనారాయణ.. ఇద్దరూ వైసీపీలో కీలక నేతలే. ఎన్నికల తర్వాత ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ను కొనసాగించాలి అన్నదానిపై పార్టీ నిర్ణయం ఉంటుందని వైవీ సుబ్బారెడ్డి చేసిన వ్యాఖ్యల దేనికి సంకేతం? రాజధాని రాజకీయం.. ప్రైమ్ టైమ్ డిబేట్…

Also Read : మరో ఛాన్స్ లేనట్లేనా? ఆ ఇద్దరు మహిళా ఎంపీల రాజకీయ భవిష్యత్‌‌పై సందేహాలు