విదేశాలకు జగన్ : అనుమతిచ్చిన సీబీఐ కోర్టు

  • Publish Date - February 15, 2019 / 08:27 AM IST

హైదరాబాద్ : అక్రమ ఆస్తుల కేసు వ్యవహారంలో వైసీపీ అధినేత జగన్ శుక్రవారం సీబీఐ కోర్టుకు హాజరయ్యారు‌. ఆయనతో పాటు రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి కూడా కోర్టుకు హాజరయ్యారు. అయితే సీబీఐ కోర్టు ప్రిన్సిపాల్‌ జడ్జిగా జస్టిస్‌ మధుసూధన్ రావు ఈ రోజు బాధ్యతలు తీసుకోనున్న నేపథ్యంలో కేసు విచారణను వచ్చే శుక్రవారంకు వాయిదా వేశారు. 

మరోవైపు  సీబీఐ కోర్టులో జగన్ మరో పిటిషన్ దాఖలు చేశారు. తన కూతురుని చూసేందుకు లండన్ వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని  కోరుతూ జగన్ పిటీషన్ దాఖలు చేశారు.  దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం ఫిబ్రవరి18 నుంచి మార్చి 18 లోపు ఒక వారం రోజుల పాటు లండన్ వెళ్లేందుకు జగన్ కు అనుమతినిచ్చింది. 

Also Read : TikTok పట్టించింది : టీ అమ్ముతున్న సీఎం యోగి డూప్

Also Read : వన్ నేషన్ – వన్ నెంబర్ : 112 గుర్తుపెట్టుకుంటే చాలు

Also Read : ఐసీసీ ట్వీట్: సోలో లైఫే సూపర్.. సింగిల్‌గానే ఉండు

Also Read : వెరీ చీప్ : జియో 4జీ డేటా ప్లాన్ వోచర్లు ఇవే