JD lakshminarayan: విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను సవాల్ చేస్తూ సీబీఐ మాజీ జేడీ లక్ష్మినారాయణ పిల్

JD lakshminarayan: విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను సవాల్  చేస్తూ సీబీఐ మాజీ జేడీ లక్ష్మినారాయణ పిల్

Jd Pil In Ap High Court

Updated On : March 30, 2021 / 6:49 PM IST

JD lakshminarayan: విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను సవాల్ చేస్తూ సీబీఐ మాజీ జేడీ లక్ష్మీ నారాయణ ఏపీ హై కోర్టులో ఒక ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేసారు.

జేడీ వేసిన పిల్ పై హైకోర్టు బుధవారం విచారణ చేపట్టనుంది. విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణను ఆయన తప్పుపట్టారు. కార్మిక సంఘాలకు మద్దతు తెలిపారు. ఈవిషయమై జేడీ లక్ష్మినారాయణ ప్రధాన మంత్రి మోడీకి ఓ లేఖ రాశారు.

ప్రైవేటీకరణ చేయకుండా ఉండేందుకు పలు ప్రత్యామ్నాయాలను జేడీ ఆ లేఖలో సూచించారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఆంధ్రప్రదేశ్ లో నిరసనలు వ్యక్తమవుతున్నప్పటికీ  కేంద్రం మాత్రం స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరిస్తామంటోంది.

కాగా విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకువ్యతిరేకంగా ఇప్పటికే ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏపాల్ కూడా ఒక పిల్ దాఖలు చేశారు. జేడీ హై కోర్టును ఆశ్రయించటానికి ముందు విశాఖ ఉక్కు ఉద్యమంలో భాగంగా తొలి రాజీనామా చేసిన టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావును, రాజమండ్రిమాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ తోనూ చర్చలు జరిపారు.