KCR దిశానిర్దేశం : TRS విస్తృత స్థాయి సమావేశం

  • Published By: madhu ,Published On : January 4, 2020 / 03:56 AM IST
KCR దిశానిర్దేశం : TRS విస్తృత స్థాయి సమావేశం

Updated On : January 4, 2020 / 3:56 AM IST

మున్సిపల్ ఎన్నికలకు పార్టీలు సన్నద్ధమౌతున్నాయి. గెలుపే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తున్నాయి. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో క్వీన్ స్వీప్ చేసినట్లే..మున్సిపల్ ఎన్నికల్లో గెలవాలని అధికార పార్టీ టీఆర్ఎస్ భావిస్తోంది. ఇప్పటికే పార్టీ కేడర్‌ను అప్రమత్తం చేసింది.

ఈ క్రమంలో…2020, జనవరి 04వ తేదీ శనివారం టీఆర్‌ఎస్‌ విస్తృత స్థాయి సమావేశం జరుగనుంది. ఉదయం 11.30 గంటలకు తెలంగాణ భవన్‌లో ఈ సమావేశం ప్రారంభంకానుంది. సాయంత్రం 4 గంటల వరకు సమావేశం కొనసాగుతుంది.

ఈ సమావేశానికి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, లోక్‌సభ, రాజ్యసభ సభ్యులు హాజరుకానున్నారు. జెడ్పీ చైర్మన్లు, రాష్ట్ర కార్పొరేషన్ల చైర్మన్లతోపాటు పార్టీ కార్యవర్గ సభ్యులు సమావేశంలో పాల్గొంటారు. టీఆర్‌ఎస్‌ విస్తృత స్థాయి సమావేశంలో ప్రధానంగా మున్సిపల్‌ ఎన్నికలపైనే చర్చ జరుగనుంది. పార్టీ శ్రేణులకు టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ దిశానిర్దేశం చేయనున్నారు.

మున్సిపల్‌ ఎన్నికల్లోనూ గులాబీ జెండాను రెపరెపలాడించమే లక్ష్యంగా ప్రణాళికలు రచించి వివరించనున్నారు. ఇప్పటికే కేసీఆర్‌ అన్ని మున్సిపాలిటీల్లోని పరిస్థితులపై నివేదికలు తెప్పించుకున్నట్లు సమాచారం. వాటి ఆధారంగా పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్నారు.

అసెంబ్లీ ఎన్నికల సమయంలో అనుసరించిన వ్యూహాలనే మున్సిపల్‌ ఎన్నికల్లోనూ  కేసీఆర్‌ ఫాలో అవుతున్నారు. రిజర్వేషన్లు ఖరారయ్యాక… విపక్షాల కంటే ముందు అభ్యర్థులను ప్రకటించి ప్రచారంలో ముందుండాలని గులాబీ బాస్‌ భావిస్తున్నారు. అసంతృప్తులు రెబల్స్‌గా పోటీ చేయకుండా చూసే బాధ్యత స్థానిక నాయకత్వానికి అప్పగించారు. అటు గ్రూప్ పాలిటిక్స్‌పైనా కేసీఆర్ ఫోకస్ పెట్టారు. 

* 120 మున్సిపాల్టీలు, 10 కార్పొరేషన్లకు ఎన్నికలు నిర్వహిస్తారు. 
* 2020, జనవరి 07వ తేదీన మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్.
* 2020, జనవరి 11న నామినేషన్ల పరిశీలన.
* 2020, జనవరి 10 నామినేషన్ల స్వీకరణకు తుది గడువు.

* 2020, జనవరి 11న నామినేషన్ల పరిశీలన.
* 2020, జనవరి 14వ తేదీ నామినేషన్ల ఉపసంహరణకు తుది గడువు. 
* 2020, జనవరి 22న పోలింగ్.
* 2020, జనవరి 25న కౌంటింగ్.
* 2020, జనవరి 24 (రీ పోలింగ్ వస్తే)

Read More : తెలంగాణలో 4 లక్షల ఉద్యోగాలు