Delhi Politics: మీ పని మీరు చేయండి, మా పని మమ్మల్ని చేసుకోనివ్వండి.. ఢిల్లీ ఎల్జీతో కేజ్రీవాల్
ఢిల్లీలో శాంతిభద్రతలు అత్యంత పతనావస్తకు పడిపోతున్నాయి. కానీ ఎల్జీ మాత్రం మురికి రాజకీయాల్లో కూరుకుపోయి ఉన్నారు. ఢిల్లీ ప్రభుత్వంలో జోక్యం చేసుకోవడానికి వరుస పెట్టి అధికారుల్ని తన వద్దకు పిలిపించుకుంటూ సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఢిల్లీ ప్రజలు ఎప్పుడూ ఇంత దుర్భరమైన శాంతిభద్రతల సమస్యను ఎదుర్కోలేదు. ప్రజలు ఎల్జీపై చాలా కోపంగా ఉన్నారు. ముందు ప్రజల్ని పట్టించుకోండి

Kejriwal hits at Delhi L-G over law and order situation
Delhi Politics: దేశ రాజధాని ఢిల్లీలో లెఫ్టినెంట్ గవర్నర్(ఎల్జీ) వీకే సెక్సేనాకు ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు మధ్య యుద్ధం కొనసాగుతూనే ఉంది. తాజాగా ఢిల్లీ వుమెన్ కమిషన్ చీఫ్ స్వాతి మలవాల్ మీద జరిగిన దాడిని ప్రస్తావిస్తూ ఎల్జీపై మరోసారి దాడికి దిగారు కేజ్రీవాల్. ఎల్జీ బాధ్యత శాంతిభద్రతలు చూసుకోవడమని, అయితే ఆ పని వదిలేసి ప్రభుత్వం చేయాల్సిన పనుల్లో తలదూర్చుతున్నారంటూ ఆయన మండిపడ్డారు. ట్విట్టర్ వేదికగా స్పందించిన ఆయన.. ఎల్జీపై విమర్శలు గుప్పించారు.
Wrestler protest: రాజీనామా చేసే ప్రసక్తే లేదన్న బ్రిజ్ భూషణ్.. IOAని ఆశ్రయించిన రెజ్లర్లు
‘‘ఢిల్లీలో శాంతిభద్రతలు అత్యంత పతనావస్తకు పడిపోతున్నాయి. కానీ ఎల్జీ మాత్రం మురికి రాజకీయాల్లో కూరుకుపోయి ఉన్నారు. ఢిల్లీ ప్రభుత్వంలో జోక్యం చేసుకోవడానికి వరుస పెట్టి అధికారుల్ని తన వద్దకు పిలిపించుకుంటూ సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఢిల్లీ ప్రజలు ఎప్పుడూ ఇంత దుర్భరమైన శాంతిభద్రతల సమస్యను ఎదుర్కోలేదు. ప్రజలు ఎల్జీపై చాలా కోపంగా ఉన్నారు. ముందు ప్రజల్ని పట్టించుకోండి’’ అని కేజ్రీవాల్ ట్వీట్ చేశారు.
Twitter Blue Tick : ట్విట్టర్ ఆండ్రాయిడ్ యూజర్లు రూ.900లకే బ్లూ టిక్ మార్క్ కొనుగోలు చేయొచ్చు!
ఇక మరో ట్వీట్లో ‘‘ఎల్జీ సర్, మీ పని ఢిల్లీలో శాంతిభద్రతలు సమీక్షించడం. ఢిల్లీ పోలసులతో పాటు డీడీఏను సమర్థవంతంగా నడిపించడం. మా పని (ప్రభుత్వం) మిగిలిన అన్ని పనుల్ని చక్కదిద్దడం. మీరు మీ పని సరిగా నిర్వర్తించండి. అలాగే మమ్మల్ని మా పని చేసుకోనివ్వండి. అలా అయితేనే ఈ వ్యవస్థ నడుస్తుంది. కానీ మీరు మీ పని వదిలేసి, మా పనుల్లో తలదూర్చుతున్నారు. అంతే కాకుండా మా పనులకు ఇబ్బందులు కలిగిస్తున్నారు. ఇలా అయితే వ్యవస్థ ఎలా నడుస్తుంది?’’ అని కేజ్రీవాల్ ప్రశ్నించారు.