హుజూర్ నగర్ టీడీపీ అభ్యర్ధి కిరణ్మయి

  • Publish Date - September 29, 2019 / 11:04 AM IST

హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో టీ టీడీపీ తన అభ్యర్ధిని ప్రకటించింది.   పార్టీ సీనియర్ నాయకురాలు కిరణ్మయిని పోటీకి దింపింది. ఈమేరకు పార్టీ అధ్యక్షుడు ఎల్ రమణ  కిరణ్మయికి బీ ఫారం అందచేశారు. ఈ ఉప ఎన్నికల్లో టీ టీడీపీ ఒంటరిగానే బరిలోకి  దిగుతోంది.  

హుజూర్ నగర్ ఉప ఎన్నికపై పార్టీ జాతీయ అధ్యక్షుడు గత కొంత కాలంగా దృష్టి పెట్టారు. పార్టీలోని సీనియర్ నాయకులు కార్యకర్తల అభీష్టం మేరకు హుజూర్ నగర్ ఉప ఎన్నికలో పోటీ చేయాలని నిర్ణయించి కిరణ్మయిని ఎంపిక చేశారు.  

టీడీపీ గతంలో జరిగిన తెలంగాణ  అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తో కలిసిపోటీచేసి 2 స్ధానాలతో సరిపెట్టుకుంది.ఏప్రియల్ లో జరిగిన లోక్ సభ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉన్న టీడీపీ ఉప ఎన్నికలో పోటీ చేసేందుకు సిధ్ధమయ్యింది.