ఢిల్లీ గులాంలు కావాలా..తెలంగాణ గులాబీ కావాలా – కేటీఆర్

ఢిల్లీ గులాంలు కావాలా ? తెలంగాణ గులాబీ కావాలా ? ఆలోచించుకోవాలని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రజలకు పిలుపునిచ్చారు.

  • Published By: madhu ,Published On : March 9, 2019 / 12:18 PM IST
ఢిల్లీ గులాంలు కావాలా..తెలంగాణ గులాబీ కావాలా – కేటీఆర్

ఢిల్లీ గులాంలు కావాలా ? తెలంగాణ గులాబీ కావాలా ? ఆలోచించుకోవాలని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రజలకు పిలుపునిచ్చారు.

ఢిల్లీ గులాంలు కావాలా ? తెలంగాణ గులాబీ కావాలా ? ఆలోచించుకోవాలని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రజలకు పిలుపునిచ్చారు. చేవెళ్ల పార్లమెంట్ స్థానంపై టీఆర్ఎస్ జెండా ఎగరడం ఖాయమన్నారు. మోడీ సబ్ కా సాత్ అంటారు..కానీ తెలంగాణకు మొండిచెయ్యి ఇచ్చారన్నారు. 2019లో జరిగే లోక్ సభ ఎన్నికలు అత్యంత కీలకమని…16 సీట్లను టీఆర్ఎస్, ఒక ఎంపీ సీటు ఎంఐఎం గెలుచుకుంటే ఢిల్లీ మెడలను వంచే శక్తి వస్తుందన్నారు కేటీఆర్.

మార్చి 09వ తేదీ శనివారం చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గ టీఆర్ఎస్ సన్నాహక సభ జరిగింది. ఈ సభకు కేటీఆర్ ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో గులాబీ జోరుతో ప్రత్యర్థుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి…ఇప్పటికీ షాక్ నుండి నేతలు కోలుకోలేదన్నారు. ఆ ఎన్నికల్లో స్వల్ప ఓట్ల తేడాతో టీఆర్ఎస్ నేతలు పరాజయం చెందారని గుర్తు చేశారు. 
Read Also : చిరంజీవి బయోపిక్: నాగబాబు ఏం చెప్పాడంటే?

చేవెళ్ల పార్లమెంట్ విభిన్నమైన నియోజకవర్గమన్నారు. రాహుల్..మోడీ మధ్య జరుగుతున్న ఎన్నికలు అని పైన మాటలు చెబుతున్నా..లోపల అంతర్మథనం చెందుతున్నారని కాంగ్రెస్‌ని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. కాంగ్రెస్, బీజేపీ పార్టీలు దేశాన్ని పాలించాయని గుర్తు చేసిన కేటీఆర్..ప్రజల స్థితిగతులు, బతుకులు మారలేదని సభలో వెల్లడించారు. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తరువాత ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలు దేశ దృష్టిని ఆకర్షించాయన్నారు. 

తెలంగాణ రాష్ట్రంలో ఒక్క ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వలేదన్న కేటీఆర్…అక్కడ ప్రధాన మంత్రి ఎవరు అయినా…టీఆర్ఎస్ ఏది చెబితే అది జరగదా..నిధులు రావా ? ఆలోచించు కోవాలని ప్రజలకు సూచించారు. పాలమూరు ఎత్తిపోతల పథకం రూ. 40 వేలు కోట్లు ఖర్చవుతాయి..దీనికి జాతీయ హోదా ప్రకటించాలని స్వయంగా కేసీఆర్ కోరినా..లెటర్‌లు రాసినా కేంద్రం స్పందించలేదన్నారు. రానున్న రెండు..మూడేళ్లలో పశ్చిమ రంగారెడ్డిని సస్యశ్యామలం చేసేది ఒక్క కేసీఆర్ వల్లే సాధ్యమని, పార్లమెంట్ ఎన్నికల బరిలో నిలబడే టీఆర్ఎస్, ఎంఐంఎం ఎంపీలను గెలిపించాలని కేటీఆర్ కోరారు. 
Read Also : మెట్రో స్టేషన్లకు అమర జవాన్ల పేర్లు