మెట్రోలో MakeMyTrip : ఆరుగురికి ఒకేసారి ట్రిప్

హైదరాబాద్ మెట్రోలో మరో విధానం వచ్చింది. మేక్ మై ట్రిప్ ద్వారా క్యూ ఆర్ కోడ్ బుకింగ్ సిస్టంను లాంఛ్ చేశారు. 2019, డిసెంబర్ 23వ తేదీ సోమవారం జరిగిన ఈ కార్యక్రమంలో మెట్రో ఎండీ ఎన్ వీ ఎస్ రెడ్డి, మేక్ మై ట్రిప్ సీఈవో రాజేశ్ లు పాల్గొన్నారు.
ప్రపంచంలోనే మన మెట్రో బెస్ట్ అన్నారు. ప్యాసింజర్లకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు తాము కృషి చేయడం జరుగుతోందన్నారు. మేక్ మై ట్రిప్ క్యూ ఆర్ కోడ్ ద్వారా ప్రయాణించవచ్చన్నారు. ఆరుగురికి ఒకేసారి ట్రిప్ ను బుక్ చేసే అవకాశం ఉందని సూచించారు. ఇలా బుక్ చేసిన ట్రిప్ ను వాట్సప్ ద్వారా ఇతరులకు పంపించుకోవచ్చన్నారు. తొలి విడతలో భాగంగా 20 మెట్రో స్టేషన్ లలో ఈ సౌకర్యం కల్పించినట్లు వెల్లడించారాయన. జనవరి చివరి నుంచి అన్ని స్టేషన్లలో అందుబాటులోకి తెస్తామని ప్రకటించారు.
క్యూ ఆర్ కోడ్ టిక్కెటింగ్ లో అనుకూలతలు : –
* ఇందులో ఎన్నో అనుకూలతలున్నాయి. స్నేహితులు, కుటుంబ సభ్యులు ఎవరైనా ఫలానా స్టేషన్ నుంచి మెట్రోలో వస్తున్నామంటే..వారికి ఇంటి నుంచే మొబైల్ ద్వారా టికెట్లు బుక్ చేసి క్యూ ఆర్ కోడ్ ని వారికి వాట్సప్ లో పంపవచ్చు.
* మేక్ మై ట్రిప్, గోఐబీబో, బుక్ మై షో వంటి యాప్స్ లోనూ బుక్ చేసుకొనే ఛాన్స్.
* స్టేషన్ కు రాకుండానే సెల్ నుంచి యాప్ లో టికెట్ తీసుకోవచ్చు.
* ఏ స్టేషన్ లో ఎక్కి ఏ స్టేషన్ దిగుతారో వివరాలు చెబితే అంత దూరానికి టికెట్ క్యూ ఆర్ కోడ్ రూపంలో వస్తుంది.
* ఇంటర్ నెట్ బ్యాంకింగ్, డెబిట్, క్రెడిట్ కార్డు రూపంలో ధర చెల్లించవచ్చు.
* స్టేషన్ కు చేరుకుని క్యూ ఆర్ కోడ్ గుర్తించే ఆటోమెటిక్ ఫేర్ కలెక్షన్ గేట్ల వద్ద స్కానర్ పై చూపించగానే తెరుచుకుంటుంది. బయటకు వచ్చినప్పుడు ఇదే విధానంగా ఉంటుంది.
Read More : దిశ కేసు : రీ పోస్టుమార్టం..ఎన్నెన్ని బుల్లెట్ గాయాలంటే