Bengal Politics: పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నాయట.. మమత బెనర్జీ ఏంటి ఇలా అనేశారు?

రాష్ట్రంలోని సౌత్ 24 పరగణాల జిల్లా బాంగర్‌లో ఈ బాంబుదాడుల ఘటన చోటుచేసుకుంది. నామినేషన్లు దాఖలు చేయాల్సిన బ్లాక్ డవలప్‌మెంట్ కార్యాలయానికి ఒక కిలోమీటరు దూరంలోనే గుర్తుతెలియని వ్యక్తులు బాంబు దాడులకు పాల్పడ్డారు.

Bengal Politics: పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నాయట.. మమత బెనర్జీ ఏంటి ఇలా అనేశారు?

Updated On : June 16, 2023 / 5:07 PM IST

Panchayat Polls: పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల నామినేషన్లు ప్రారంభమైన నాటి నుంచి పెద్ద ఎత్తున అల్లర్లు జరుగుతున్నాయి. కొంత కాలంగా ఎన్నికల మధ్యలో అల్లర్లు జరుగుతున్నాయో, అల్లర్ల మధ్య ఎన్నికలు జరుగుతున్నాయో కూడా అర్థం కావడం లేదు. ఈ రెండూ రాష్ట్రంలో సర్వసాధారణమైపోయాయి. అయితే ఇంతటి ఘర్షణ వాతావరణం ఉన్నప్పటికీ పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నాయని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రకటించడం గమనార్హం. వాస్తవానికి ఈ అల్లర్లపై అధికార, విపక్షాలు పెద్ద ఎత్తున విమర్శలు గుప్పించుకుంటున్నాయి.

Manipur Violence: మణిపూర్‭లో శాంతిభద్రతలు విఫలం.. కేంద్ర మంత్రి సంచలన వ్యాఖ్యలు

ఇదే సమయంలో అసలు ఎలాంటి ఘర్షణే లేనట్టు వాతావరణం ప్రశాతంగా ఉందని, ఎన్నికలు సజావుగా జరుగుతున్నాయని మమతా చెప్పడం గమనార్హం. నిజానికి రాష్ట్రంలో అల్లర్లు కర్రలు, రాళ్లు విసుకోవడం నుంచి బాంబులు విసిరే వరకులు వెళ్లింది. మంగళవారం గుర్తుతెలియని వ్యక్తులు జరిపిన బాంబు దాడులతో పోలీసులు, మీడియా సిబ్బంది, ప్రజలు పరుగులు పెట్టారు.

Ritlal Yadav: రామచరితమానస్ మసీదులో రాశారట.. మరో వివాదానికి తెరలేపిన ఆర్జేడీ నేత

రాష్ట్రంలోని సౌత్ 24 పరగణాల జిల్లా బాంగర్‌లో ఈ బాంబుదాడుల ఘటన చోటుచేసుకుంది. నామినేషన్లు దాఖలు చేయాల్సిన బ్లాక్ డవలప్‌మెంట్ కార్యాలయానికి ఒక కిలోమీటరు దూరంలోనే గుర్తుతెలియని వ్యక్తులు బాంబు దాడులకు పాల్పడ్డారు. పంచాయతీ ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థులు పోటీ చేస్తున్నట్టు ఇండియన్ సెక్యులర్ ఫ్రెంట్ (ఐఎస్ఎఫ్) స్థానిక ఎమ్మెల్యే ఒకరు మంగళవారం ప్రకటించారు. అనంతరం కొద్ది గంటల్లోనే బాంగర్‌లో హింస చెలరేగింది.

Russia-Ukraine War: రష్యా-ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపేందుకు పెద్ద సాహసానికే దిగిన ఆఫ్రికా నేతలు

టీఎంసీ కార్యకర్తలే ఈ దాడులకు పాల్పడినట్టు ఐఎస్ఎఫ్ ఆరోపించగా, ఐఎస్ఎఫ్‌నే హింసకు దిగినట్టు టీఎంసీ ఆరోపిస్తోంది. నామినేషన్ల పర్వం ప్రారంభమైనప్పటికీ తీవ్ర హింసాత్మక పరిస్థితి ఏర్పడడంతో నామినేషన్ కేంద్రాలకు కిలోమీటర్ పరిధి వరకూ 144 నిషేధాజ్ఞలు విధించాలంటూ జిల్లా మెజిస్ట్రేట్‌లు, పోలీసు కమిషనర్లను రాష్ట్ర ఎన్నికల కమిషన్ గత ఆదివారంనాడు ఆదేశించింది. ఈనెల 15వ తేదీ వరకూ ఈ ఆదేశాలు అమల్లో ఉంటాయి.