Manipur Violence: రాహుల్ గాంధీ ‘మణిపూర్’ పర్యటనపై పొగడ్తలు కురిపించిన బీజేపీ చీఫ్

పరిస్థితి మెరుగుపడుతుందనే నమ్మకంతో ప్రజలు ముఖ్యమంత్రికి మద్దతుగా నిలిచారు. ఈసారి పరిస్థితిని అదుపు చేయకపోతే పరిస్థితి చేయి దాటిపోయే ప్రమాదం ఉందని ప్రజలు భావిస్తున్నారు. రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితి గత ప్రభుత్వ హయాం కారణంగానే ఏర్పడింది

Manipur Violence: రాహుల్ గాంధీ ‘మణిపూర్’ పర్యటనపై పొగడ్తలు కురిపించిన బీజేపీ చీఫ్

Updated On : July 1, 2023 / 5:23 PM IST

Rahul Gandhi: అల్లర్లలో చిక్కుకుని అతలాకుతలమైన మణిపూర్ రాష్ట్రాన్ని రాహుల్ గాంధీ సందర్శించడంపై హర్షం వ్యక్తం చేశారు ఆ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ చీఫ్ అధికారిమయుం శార్ద దేవి. రాష్ట్రానికి పూర్వ వైభవం తీసుకురావాలని, దానికి అందరూ కృషి చేయాల్సిన అవసరం ఉందని అన్న ఆమె.. జాతి ఘర్షణల నేపథ్యంలో మణిపూర్‌లో ప్రస్తుత పరిస్థితులను రాజకీయం చేయవద్దని ఆమె కోరారు.

HDFC: ప్రపంచంలోనే అత్యంత విలువైన బ్యాంకుల జాబితాలో 4వ స్థానంలో హెచ్‌డీఎఫ్‌సీ.. టాప్-5 బ్యాంకులు ఇవే..

‘‘ప్రస్తుత పరిస్థితుల్లో రాహుల్ గాంధీ రాష్ట్ర పర్యటనను అభినందిస్తున్నాను. అయితే పరిస్థితిని పరిష్కరించడం, తిరిగి శాంతిని తీసుకురావడంపై దృష్టి పెట్టాలి. ఈ అంశాన్ని రాజకీయం చేయకూడదు’’ అని దేవి అన్నారు. గురువారం రాహుల్ గాంధీ చురచంద్‌పూర్ జిల్లాలోని సహాయక శిబిరాలను సందర్శించారు. ఆ మరుసటి రోజు బిష్ణుపూర్ జిల్లాలోని మోయిరాంగ్‌లో సందర్శించారు. విద్యార్థి సంఘాల ప్రతినిధులు, మహిళలు, మేధావులతో సంభాషించారు. అనంతరం రాష్ట్ర గవర్నర్ అనుసూయా ఉకేతో సమావేశమయ్యారు.

Parliament Monsoon Session: విడుదలైన పార్లటెంట్ సమావేశాల షెడ్యూల్.. ప్రారంభం పాత భవనంలో, ముగింపు కొత్త భవనంలో..

ఇక రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్ బీరెన్ సింగ్‌ తొలుత రాజీనామా చేస్తా అని ప్రకటించి, అనంతరం చేయట్లేదని ప్రకటించడపై ఆమె స్పందిస్తూ “పరిస్థితి మెరుగుపడుతుందనే నమ్మకంతో ప్రజలు ముఖ్యమంత్రికి మద్దతుగా నిలిచారు. ఈసారి పరిస్థితిని అదుపు చేయకపోతే పరిస్థితి చేయి దాటిపోయే ప్రమాదం ఉందని ప్రజలు భావిస్తున్నారు. రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితి గత ప్రభుత్వ హయాం కారణంగానే ఏర్పడింది. సీఎం బీరెన్ ప్రభుత్వంపై ప్రజలకు పూర్తి విశ్వాసం ఉంది” అని అన్నారు.

Suitcases Banned : ఈ అందాల నగరానికి సూట్‌కేసులు తీసుకెళితే జరిమానా.. ఎన్నో నిబంధనలున్నా పర్యాటకంగా అగ్రస్థానం

“మణిపూర్‌లోని నా సోదరులు, సోదరీమణులందరి మాటలు వినేందుకే నేను వచ్చాను. అన్ని వర్గాల ప్రజలు ఎంతో ఆప్యాయంగా ఆదరిస్తున్నారు. ప్రభుత్వం నన్ను అడ్డుకోవడం చాలా దురదృష్టకరం. మణిపూర్‌కు వైద్యం అవసరం. శాంతి మాత్రమే మా ప్రాధాన్యత అని రాహుల్ గాంధీ తన ట్విట్టర్‌లో పేర్కొన్నారు. అయితే రాహుల్ పర్యటనపై బీజేపీ పెద్ద ఎత్తున విమర్శలు గుప్పించింది. ఆ పార్టీ అధికార ప్రతినిధి సంబిత్ పాత్రా స్పందిస్తూ.. అత్యంత సున్నితమైన పరిస్థితులు ఉన్న రాష్ట్రంలో రాహుల్ మొండితనంగా సందర్శించడం సరికాదని, అక్కడికి వెళ్ళే ముందు వాస్తవిక వాస్తవాల గురించి తెలుసుకోవాలని సూచించారు.

Teesta Setalvad: గుజరాత్ అల్లర్ల కేసులో యాక్టివిస్ట్ తీస్తా సెతల్వాద్‭కు హైకోర్టులో గట్టి ఎదురుదెబ్బ.. వెంటనే లొంగిపొమ్మంటూ ఆదేశాలు

బీజేపీ విమర్శలపై కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. “వారు (బీజేపీ) ఎప్పుడూ అసూయతోనే మాట్లాడతారు. ఒక కాంగ్రెస్ నాయకుడు అక్కడికి (మణిపూర్) వెళ్లి ప్రజల కష్టాలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తే, వారు దానిని డ్రామా అన్నారు. పాట్నాలో ప్రతిపక్షాల సమావేశాన్ని ఫోటో సెషన్ అంటారు. వారిది ప్రజాస్వామ్య మనస్తత్వం కాదు, ఒంటినిండా నియంతృత్వం కలిగి ఉన్నారు” అని ఖర్గే అన్నారు.