Rs 850 crore scam: ఏకంగా చీఫ్ సెక్రెటరీకే ఎసరు పెట్టిన మంత్రి.. ఆ అధికారులను తొలగించాలంటూ సీఎంకు 650 పేజీల నివేదిక

ఆమ్ ఆద్మీ పార్టీ వర్గాల సమాచారం ప్రకారం, చీఫ్ సెక్రటరీ నరేష్ కుమార్‌కు సంబంధించిన అవినీతి కేసులో ఢిల్లీ విజిలెన్స్ మంత్రి అతిషి 650 పేజీల ప్రాథమిక నివేదికను ఢిల్లీ ముఖ్యమంత్రికి సమర్పించారు. చీఫ్ సెక్రటరీ తన కుమారుడి కంపెనీకి రూ.850 కోట్ల అక్రమ లాభాలు సమకూర్చినట్లు విచారణలో తేలింది.

Rs 850 crore scam: ఏకంగా చీఫ్ సెక్రెటరీకే ఎసరు పెట్టిన మంత్రి.. ఆ అధికారులను తొలగించాలంటూ సీఎంకు 650 పేజీల నివేదిక

Delhi News: ఢిల్లీలోని ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వంలో విజిలెన్స్ మంత్రిగా ఉన్న అతిషి అవినీతికి సంబంధించిన కేసులో ముఖ్యమంత్రికి 650 పేజీల ప్రాథమిక నివేదికను సమర్పించారు. ఈ అవినీతి కేసు చీఫ్ సెక్రటరీ నరేష్ కుమార్ ఆయన కుమారుడికి సంబంధించినది. నరేష్ కుమార్ తన కుమారుడికి లబ్ధి చేకూర్చారని ఆమె ఆరోపించారు. ఈ విషయమై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు విజిలెన్స్ మంత్రి అతిషి ప్రాథమిక నివేదిక సమర్పించారు. దీంతో ఢిల్లీలో ఒక్కసారిగా రాజకీయాలు వేడెక్కాయి. నరేష్‌కుమార్‌పై ఆరోపణలు నిరాధారమని, డర్టీ పాలిటిక్స్‌లో భాగంగానే ఈ ఆరోపణలు చేస్తున్నారని విపక్ష నేతలు అభిప్రాయపడ్డారు.

650 పేజీల నివేదికను సమర్పించారు
ఆమ్ ఆద్మీ పార్టీ వర్గాల సమాచారం ప్రకారం, చీఫ్ సెక్రటరీ నరేష్ కుమార్‌కు సంబంధించిన అవినీతి కేసులో ఢిల్లీ విజిలెన్స్ మంత్రి అతిషి 650 పేజీల ప్రాథమిక నివేదికను ఢిల్లీ ముఖ్యమంత్రికి సమర్పించారు. చీఫ్ సెక్రటరీ తన కుమారుడి కంపెనీకి రూ.850 కోట్ల అక్రమ లాభాలు సమకూర్చినట్లు విచారణలో తేలింది. 2015లో ద్వారకా ఎక్స్‌ప్రెస్‌వే సమీపంలో కేవలం రూ.75 లక్షలకు భూమిని కొనుగోలు చేసినట్లు ఆమ్ ఆద్మీ పార్టీ వర్గాలు తెలిపాయి. ఇప్పుడు ఈ భూమిని ఖరీదైన రేటుతో స్వాధీనం చేసుకున్నారు. ఆ తర్వాత కంపెనీకి 850 కోట్ల రూపాయల లాభాలు వచ్చాయి.

అక్టోబర్‌లో ఫిర్యాదు
ద్వారకా ఎక్స్‌ప్రెస్‌వే ప్రాజెక్ట్‌లో జరిగిన కుంభకోణంపై ఇప్పటికే సీఎం కేజ్రీవాల్‌కు ఫిర్యాదు చేశారు. ఈ వ్యవహారంపై దర్యాప్తు చేయాలని విజిలెన్స్‌ మంత్రి అతిశీని ముఖ్యమంత్రి ఆదేశించారు. రోడ్డు ప్రాజెక్టు కోసం సేకరించిన భూమికి ఎక్కువ నష్టపరిహారం ఇప్పించేందుకు నరేష్ కుమారుడికి ఓ వ్యక్తి బంధువు ఉద్యోగం ఇప్పించారని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నరేష్‌కుమార్‌పై ఆరోపణలు వచ్చాయి. ఇప్పుడు ఈ కేసులను విచారించనున్నారు. అక్టోబర్‌లో ఢిల్లీ ప్రభుత్వానికి ఈ ఫిర్యాదు అందింది. ఈ మొత్తం వ్యవహారంపై ప్రస్తుతం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నరేష్‌కుమార్‌ నుంచి ఎలాంటి ప్రకటన వెలువడలేదు.