చంద్రబాబు తీవ్ర వాదిలా ప్రవర్తిస్తున్నారు : మంత్రి అవంతి సంచలన వ్యాఖ్యలు
ఏపీ మంత్రి అవంతి శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఏపీ మంత్రి అవంతి శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఏపీ మంత్రి అవంతి శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు తీవ్ర వాదిలా ప్రవర్తిస్తున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు ఆదివారం (జనవరి 19, 2020) విశాఖలో మంత్రి అవంతి మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు అభివృద్ధి నిరోధకుడిగా తయారయ్యారని విమర్శించారు.
చంద్రబాబుకు ఎమ్మెల్యేగా ఉండే అర్హత లేదని అన్నారు. ఉత్తరాంధ్ర ఎమ్మెల్యేలు లేకపోతే ప్రతిపక్ష హోదా కూడా ఉండేది కాదని ఎద్దేవా చేశారు. సీనియర్ నని చెప్పుకుంటున్న ఆయనకు సిగ్గు, లజ్జ లేదని మండిపడ్డారు. ముందు ఆ ఆరుగురు ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించాలన్నారు. అసెంబ్లీ ముట్టడి చేయమని రెచ్చగొట్టడం సరికాదన్నారు.