విధేయ రామ : సీటు రాకపోయినా జగన్ సైనికుడినే!

  • Published By: vamsi ,Published On : March 6, 2019 / 09:48 AM IST
విధేయ రామ : సీటు రాకపోయినా జగన్ సైనికుడినే!

Updated On : March 6, 2019 / 9:48 AM IST

గత ఐదేళ్లుగా జగన్‌కు విధేయుడిగా ఉంటూ ప్రభుత్వంపై కేసులు వేస్తూ పోరాడుతున్న వైసీపీ నాయకుడు మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి. అయితే రాబోయే ఎన్నికల్లో ఆయనకు సీటు లేదంటూ ఇప్పటికే పలు వార్తలు వచ్చిన క్రమంలో తనకు సీటు వచ్చినా రాకున్నా ఎప్పటికీ జగన్ సైనికుడినే అంటూ ఆళ్ల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు. తనకు సీటు ఇచ్చినా ఇవ్వకున్నా వైఎస్‌ఆర్ కుటుంబాన్ని వీడేది లేదంటూ వెల్లడించారు. 2009లో కూడా తనకు పెదకూరపాడు సీటు ఇచ్చి తీసేశారని, అయినా వైఎస్ కుటుంబాన్ని మాత్రం వీడలేదంటూ గుర్తు చేశారు. ఇప్పుడు కూడా జగన్ మాటే తనకు శిరోధార్యమంటూ ఆయన తెలిపారు.
Also Read : రమ్యపై నెటిజన్లు ఫైర్..తీసుకెళ్లి పాక్ లో వదిలిపెట్టండి

జగన్ ఆదేశాల మేరకు పార్టీ కోసం ఏం చేయమాన్నా చేస్తానని అన్నారు. తనకోసం అనుచరులు లోటస్‌పాండ్ వద్ద గొడవ చేసిన విషయం తనకు తెలియదని, తన కోసం రాజీనామా చేసిన నేతలను ఉపసంహరించుకోవాలని సూచించినట్లు ఆయన తెలిపారు. జగన్ సీటు ఇవ్వలేదనే కారణంతో అజ్ఞాతంలోకి వెళ్లానంటూ వచ్చిన వార్తలను తప్పుబట్టిన ఆళ్ల.. ఒక కేసు విషయంలో సాక్ష్యాలు సేకరించడానికి నాలుగు రోజులు అజ్ఞాతం‌లోకి వెళ్లాను తప్ప సీటు కోసం మాత్రం కాదంటూ వివరణ ఇచ్చారు.

మరోవైపు ఏపీ డీజీపీ ఆర్.పీ ఠాకూర్ పై విరుచుకుపడ్డారు. చట్టాలను పరిరక్షించాల్సిన డీజీపీయే వాటిని ఉల్లంఘిస్తూ భూకబ్జాలకు పాల్పడితే ఎలా అంటూ నిలదీశారు. ఏపీ డీజీపీ ఆర్పీ ఠాకూర్‌ అక్రమంగా హైదరాబాద్‌లో ఇంటి నిర్మాణం చేపట్టారంటూ హైకోర్టులో పిటిషన్‌ వేసిన ఆళ్ల హైకోర్టు తీర్పును స్వాగతిస్తున్నట్లు చెప్పారు. ఆళ్ల పిటీషన్ విచారించిన హైకోర్టు ధర్మాసనం జీహెచ్‌ఎంసీ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆక్రమణలు తొలిగించాలని ఆదేశించిన సంగతి తెలిసిందే.
Also Read : అమరావతిలో సొంతిల్లు : హ్యాపినెస్ట్-2కి బుకింగ్స్