NCP-Sharad Pawar: తిరుగుబాటు నేతలపై శరద్ పవార్ కఠిన నిర్ణయం.. అజిత్ పవార్‭తో పాటు 8 మంది మంత్రులపై ఆ తీర్మానం

శరద్‌ పవార్‌ మీద ఆయన సోదరుడి కుమారుడు, ఆ పార్టీ కీలక నేత అజిత్‌ పవార్ తిరుగుబాటు చేశారు. తన వర్గం నేతలతో కలిసి అజిత్ పవార్ మహారాష్ట్రలోని అధికార బీజేపీ-శివసేన షిండే వర్గంతో కలిశారు. అజిత్‌ పవార్‌‭ను బీజేపీ-శివసేన షిండే ప్రభుత్వం డిప్యూటీ సీఎంగా నియమించింది

NCP-Sharad Pawar: తిరుగుబాటు నేతలపై శరద్ పవార్ కఠిన నిర్ణయం.. అజిత్ పవార్‭తో పాటు 8 మంది మంత్రులపై ఆ తీర్మానం

Updated On : July 3, 2023 / 5:09 PM IST

NCP-Ajit Pawar: మహారాష్ట్ర (maharshtra) ఉప ముఖ్యమంత్రిగా అజిత్ పవార్ (Ajit pawar) సహా.. ఆయనతో పాటు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన మరో ఎనిమిది మంది ఎమ్మెల్యేలపై వేటు వేసేందుకు సిద్ధమయ్యారు నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ చీఫ్ శరద్ పవార్ (Sharad Pawar). అజిత్ పవార్‭కు మద్దతు ఇస్తున్న రెబల్స్‭కు పవార్ ఇలా గట్టి వార్నింగ్ ఇస్తున్నారని అంటున్నారు. కాగా, ఇప్పటికే ముంబై డివిజన్ ఎన్సీపీ చీఫ్ నరేంద్ర రాథోడ్, అకోలా సిటీ జిల్లా చీఫ్ విజయ్ దేశ్‭ముఖ్‭తో పాటు తాజాగా మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన శివాజీరావ్ గార్జే నేతలను పార్టీ నుంచి తొలగిస్తున్నట్లు ప్రకటించారు. అంతలోనే పార్టీ మీద తిరుగుబాటు చేసిన వారిపై అనర్హత వేటు వేసేందుకూ సిద్ధమయ్యారు.

Nara Lokesh : చిన్నప్పుడు చెల్లి కావాలని అమ్మను అడిగాను, పెళ్లి అయ్యాక కూతురు కావాలని బ్రహ్మణిని అడిగాను : లోకేశ్ ఆసక్తికర వ్యాఖ్యలు 

మహారాష్ట్రలోని బీజేపీ-శివసేన కూటమికి మద్దతు ఇచ్చిన 9 మంది నేతలపై పార్టీలోని క్రమశిక్షణా కమిటీ అనర్హత వేటు వేయనుంది. ఈ విషయమై పార్టీ అంతర్గత సమావేవంలో పెట్టిన తీర్మాణం ఆమోదం పొందింది కూడా. ఈ విషయమై పార్టీ నుంచి విడుదలైన ఒక అధికారిక లేఖలో ‘‘ఈ 9 మంది ఎమ్మెల్యేలపై ఇప్పటికిప్పుడే అనర్హత వేటు వేయబోతున్నాం. అయితే వీరిని పార్టీలోనే కొనసాగించినట్లైతే, ఏ సమయంలోనైనా పార్టీ ప్రయోజనాలను దెబ్బతీసే అవకాశం ఉంది’’ అని పేర్కొన్నారు.

KA Paul: తాను సీఎం అయితే ఆ రెండు డబుల్ చేస్తానన్న కేఏ పాల్.. ప్రగతి భవన్ వద్ద హల్‌చల్

శరద్‌ పవార్‌ మీద ఆయన సోదరుడి కుమారుడు, ఆ పార్టీ కీలక నేత అజిత్‌ పవార్ తిరుగుబాటు చేశారు. తన వర్గం నేతలతో కలిసి అజిత్ పవార్ మహారాష్ట్రలోని అధికార బీజేపీ-శివసేన షిండే వర్గంతో కలిశారు. అజిత్‌ పవార్‌‭ను బీజేపీ-శివసేన షిండే ప్రభుత్వం డిప్యూటీ సీఎంగా నియమించింది. కొన్ని రోజుల క్రితమే నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీలో భారీ మార్పులు జరిగిన విషయం తెలిలిసిందే. ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్లుగా సుప్రియా సూలే, ప్రఫుల్ పటేల్ ను నియమించారు. ఆ పార్టీలో అజిత్ పవార్ ‭కు ప్రాధాన్యం లేకుండా పోయింది.

Mumbai : వర్షంలో ‘రిమ్‌జిమ్ గిరే సావన్’ పాట ఫ్రేమ్ బై ఫ్రేమ్ రిక్రీయేట్ చేసిన వృద్ధ జంట .. ట్వీట్ చేసిన ఆనంద్ మహీంద్రా

వాస్తవానికి.. వచ్చే ఏడాది జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీకి వ్యతిరేంగా విపక్షాలను ఏకం చేయడంలో శరద్ పవార్ కీలక పాత్ర పోషస్తారని ఊహగాణాలు వస్తున్న నేపథ్యంలో.. సొంత పార్టీ నుంచే తిరుగుబాటు రావడం గమనార్హం. కేంద్రంలో బీజేపీ వ్యతిరేక కూటమిని సిద్ధం చేయడం పక్కన పెడితే.. ముందు సొంత పార్టీని చక్కదిద్దుకోవాల్సిన అవసరం ఏర్పడింది. అయితే 1999లో పార్టీ స్థాపించినప్పటికీ ఎప్పుడూ పార్టీ చీలిపోదని, ఇప్పుడు కూడా అలా జరగదని శరద్ పవార్ తేల్చి చెప్పారు.