KA Paul: తాను సీఎం అయితే ఆ రెండు డబుల్ చేస్తానన్న కేఏ పాల్.. ప్రగతి భవన్ వద్ద హల్‌చల్
తనకు ప్రాణ హాని ఉందని హైకోర్టులో పిటిషన్ వేశానని, అయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం తనకు భద్రత కల్పించడం లేదని చెప్పారు.

Ka Paul
KA Paul – Pagathi Bhavan: తెలంగాణ(Telangana)కు తాను సీఎం అయితే పెన్షన్స్, రైతు బంధు డబుల్ చేస్తానని ప్రజాశాంతి పార్టీ (Praja Shanti Party) అధ్యక్షుడు కేఏ పాల్ అన్నారు. హైదరాబాద్ లోని తెలంగాణ హైకోర్టు వద్ద ఆయన మాట్లాడారు.
తెలంగాణలోని కామారెడ్డి రైతుల పిటిషన్ పై ఇవాళ విచారణ జరగాల్సి ఉన్నప్పటికీ అది లిస్ట్ కాకుండా కొందరు అడ్డుపడుతున్నారంటూ కేఏ పాల్ ఆరోపణలు చేశారు. రైతుల తరఫున తాను పార్టీ ఇన్‌పర్సన్ గా పిటిషన్ వేశానని తెలిపారు. ధరణి పోర్టల్ పై పిల్ వేస్తానని చెప్పారు.
ధరణిలో అనేక అక్రమాలు జరిగాయని కేఏ పాల్ అన్నారు. అలాగే, తనకు ప్రాణ హాని ఉందని హైకోర్టులో పిటిషన్ వేశానని, అయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం తనకు భద్రత కల్పించడం లేదని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ ఖమ్మంలో నిర్వహించిన సభకు ఆదరణ దక్కలేదని తెలిపారు. కాంగ్రెస్ ఢిల్లీలోనే కాకుండా గల్లీలోనూ లేదని చెప్పారు. బీఆర్ఎస్ (BRS), బీజేపీ (BJP) రెండూ ఒక్కటేనని అన్నారు.
ప్రగతి భవన్ వద్దకు పాల్
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారిక నివాసం ప్రగతి భవన్ కు కేఏ పాల్ వెళ్లారు. కేసీఆర్ ను కలిసేందుకు ఇక్కడకు వచ్చానని తెలిపారు. ఆయనను అడ్డుకున్న పోలీసులు అనుమతి లేదని చెప్పారు. తనకు కేసీఆర్ అపాయింట్‌మెంట్ ఎందుకు ఇవ్వడం లేదని అన్నారు.