నేటి నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం

  • Publish Date - March 18, 2019 / 02:20 AM IST

సాధారణ ఎన్నికలకు ఇప్పటికే ఎలక్షన్ కమీషన్ షెడ్యూల్ ప్రకటించగా.. ఇవాళ(18 మార్చి 2019) 10గంటలకు నోటిఫికేషన్‌జను విడుదల చేయనుంది. ఏపీ అసెంబ్లీతోపాటు 25 ఎంపీ, తెలంగాణలో 17 సహా మొత్తం 91 లోక్‌సభ స్థానాలకు తొలివిడత ఎన్నికలు జరగనుండగా.. నోటిఫికేషన్ విడుదలైన రోజు నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం అవుతుంది.
Read Also : సెంటిమెంట్: ముహూర్తాలు చూస్తున్న అభ్యర్దులు

ఉదయం 11 గంటల నుంచి నామినేషన్లను స్వీకరిస్తామని, అందుకు తగిన ఏర్పాట్లను పూర్తి చేసినట్లు ఎన్నికల సంఘం అధికారులు వెల్లడించారు. ఎన్నికల కోడ్ సమయంలో పాటించవలసిన నియమాలపై అభ్యర్ధులకు అవగాన కార్యక్రమం చేపడుతామంటూ ఎన్నికల సంఘం తెలిపింది.

మార్చి 15వ తేదీన నామినేషన్‌ల ప్రక్రియ  ప్రారంభమై.. మార్చి 25తో ప్రక్రియ ముగుస్తుందని ఎన్నికల సంఘం తెలిపింది. మార్చి 26న నామినేషన్ల పరిశీలన చేసి, పోలింగ్‌ను ఏప్రిల్ 11 నిర్వహించి, ఫలితాలను మే 23న ప్రకటిస్తారు. మొత్తం 20 రాష్ట్రాల్లో మొదట దశ 91లోక్‌సభ నియోజకవర్గాలకు ఎన్నికలు జరగుతాయి.
Read Also : బీజేపీ ఫస్ట్‌లిస్ట్: 123 మంది అభ్యర్థులు వీళ్లే