KCR బర్త్ డే..KTR పిలుపు

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి 2020, ఫిబ్రవరి 17వ తేదీన 66వ ఏట అడుగుపెడుతున్నారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర మంత్రి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ పార్టీ కార్యకర్తలకు, నాయకులకు ఓ పిలుపునిచ్చారు. హరితహారంలో భాగంగా ప్రతొక్కరూ ఒక్క మొక్క చొప్పున నాటుదామని పిలుపునిచ్చారు. ఈ మేరకు 2020, ఫిబ్రవరి 10వ తేదీ సోమవారం ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేశారు.
అధికారులు, జిల్లా కలెక్టర్లకు ఈ మేరకు విజ్ఞప్తి చేశారు. ఆయన జన్మదిన సంబరాల్లో భాగంగా పెద్ద ఎత్తున్న మొక్కలు నాటి పచ్చదనం పెంచుదామన్నారు. గతంలో కూడా పై విధంగానే పిలుపునిచ్చారాయన. ఎలాంటి హంగు ఆర్భాటాలు, ఆడంబరాలు చేయకుండా ప్రతొక్కరూ మొక్కను నాటాలని ఆయన పిలుపునిచ్చారు.
టీఆర్ఎస్ ఎంపీ సంతోష్ కుమార్ కూడా ట్వీట్ చేశారు. సీఎం కేసీఆర్ జన్మదినం సందర్భంగా…ప్రతొక్కరూ ఒక మొక్క నాటాలని పిలుపునిచ్చారు. #GreenindiaChallengeలో భాగంగా ప్రతొక్కరూ ఒక మొక్క నాటి లెజెండ్ కేసీఆర్‌కు బహుమతినివ్వాలని కోరారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్ వేదికగా పోస్టర్‌ను విడుదల చేశారు.
As our beloved Minister @KTRTRS garu appealed for #EachOnePlantOne on da occasion of 66th birthday of our Hon’ble CM #KCR sir, Let us all show our strength by planting atleast 1 sapling each on 17th feb under #GreenIndiaChallenge#SelfieWithSaplingOnBirthdayOfLegend nd send to? pic.twitter.com/80QUPC5Y8C
— Santosh Kumar J (@MPsantoshtrs) February 10, 2020
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అధికారంలోకి వచ్చిన సీఎం కేసీఆర్..పచ్చదనంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. దేశంలోనే ఎక్కడా లేని విధంగా గ్రీనరీని పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్న సంగతి తెలిసిందే. హరితహారం పేరిట పలు కార్యక్రమాలు నిర్వహించి ప్రజలతో మొక్కలు నాటించే ప్రయత్నం చేస్తోంది. ఇప్పటికే లక్షలాది మొక్కలను నాటారు.
మొక్కల పట్ల తన ఇష్టాన్ని గతంలోనే సీఎం కేసీఆర్ చాటుకున్న సంగతి తెలిసిందే. మొక్కలను నాటడమే కాకుండా..వాటి..పరిరక్షణ బాధ్యతను గ్రామ పంచాయతీలకు అప్పగించి..నాటిన ప్రతి మొక్క బతకాలనే ఉద్దేశ్యంతో సీఎం కేసీఆర్ ముందడుగు వేస్తున్నారు. ఈ సందర్భంగా తన తండ్రి కేసీఆర్ బర్త్ డేకు ఈ విధంగా స్పెషల్ గిఫ్ట్ ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు మంత్రి కేటీఆర్.
On the 17th of February 2020, Hon’ble CM Sri KCR Garu will be turning 66
As we all know his passion for ‘Haritha Haaram’ request all @trspartyonline leaders & members to make sure you celebrate & mark our leader’s birthday by planting at least one sapling ?each#EachonePlantOne
— KTR (@KTRTRS) February 10, 2020