జనసేన రైతు బంధు : ఎకరానికి రూ. 8వేలు

ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో జనసేన కూడా రైతుల ముంగిట వరాలు కురిపించింది. తాము కూడా పెట్టుబడి సాయం అందిస్తామని ప్రకటించేసింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతు బంధు, రైతు బీమా పథకాలు ప్రవేశ పెట్టిన సంగతి తెలిసిందే. ఈ పథకాలు సక్సెస్ కావడం..ప్రజలలో ఆదరణ పెరగడంతో పలు పార్టీలు ఆ దిశగా ఆలోచిస్తున్నాయి. అందులో భాగంగా జనసేన కూడా ఓ నిర్ణయం తీసుకుంది.
రైతాంగానికి జనసేన అండగా ఉంటుందని…రైతన్నలకు అండగా ఉండేందుకు ఎకరానికి రూ. 8వేలు చెల్లిస్తామని పేర్కొంది. అధికారంలోకి రాగానే దీనిని అమలు చేస్తామని హామినిచ్చింది. ఈ మేరకు ట్విట్టర్‌లో ట్వీట్ చేసింది. అంతేగాకుండా జాతీయ ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేస్తామని కీలక ప్రకటన చేసింది. ఈ రెండు అంశాలు పార్టీ మేనిఫెస్టోలో చేర్చనున్నట్లు పవన్ కళ్యాణ్ వెల్లడించారు. రైతులకు, రైతు కూలీలకు ఉపయోగపడే విధంగా దీనిని అమలు చేసి తీరుతామని స్పష్టమైన హామీనిస్తున్నట్లు వెల్లడించారు.
Read Also : హేమాహేమీలు : ఆంధ్ర ఎన్నికల స్థాయిలో.. మా ఎలక్షన్స్
మార్చి 14న పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జనసేన ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేయనున్న సంగతి తెలిసిందే. టీడీపీ ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పేరిట పెట్టుబడి సాయం అందిస్తోంది. కేంద్రం ఇచ్చే రూ.6 వేల సాయానికి ఒక్కో రైతు కుటుంబానికి రూ.15 వేలు సాయం చేస్తామని బాబు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇక వైసీపీ విషయానికి వస్తే…జగన్ కూడా పెట్టుబడి సాయం ప్రకటించారు. ప్రతి రైతుకు రూ.12,500 చొప్పున పెట్టుబడి సాయం చేస్తామని ప్రకటించారు. మరి ఎవరి హామీని రైతులు కరుణిస్తారో వెయిట్ అండ్ సీ.
Read Also : ‘మా’ ఎన్నికలు: రెండు ప్యానల్‌ల సభ్యులు వీళ్లే!