సీఎం జగన్ కి తెలియకుండా ఎలా జరుగుతుంది : ప్రశ్నించిన పవన్

జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ ఏపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఆళ్లగడ్డ దగ్గర యురేనియం డ్రిల్లింగ్ పనులు జరుగుతున్న ఫోటోను ట్విట్టర్ లో పోస్టు చేసిన పవన్.. దీనికి జగన్ ప్రభుత్వం

  • Published By: veegamteam ,Published On : September 29, 2019 / 06:16 AM IST
సీఎం జగన్ కి తెలియకుండా ఎలా జరుగుతుంది : ప్రశ్నించిన పవన్

Updated On : September 29, 2019 / 6:16 AM IST

జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ ఏపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఆళ్లగడ్డ దగ్గర యురేనియం డ్రిల్లింగ్ పనులు జరుగుతున్న ఫోటోను ట్విట్టర్ లో పోస్టు చేసిన పవన్.. దీనికి జగన్ ప్రభుత్వం

జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ ఏపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఆళ్లగడ్డ దగ్గర యురేనియం డ్రిల్లింగ్ పనులు జరుగుతున్న ఫోటోను ట్విట్టర్ లో పోస్టు చేసిన పవన్.. దీనికి జగన్ ప్రభుత్వం ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. నల్లమల పరిసర ప్రాంత ప్రజలకు తాము అండగా ఉంటామని, వారి తరఫున జనసేన పోరాటం చేస్తుందని పవన్ భరోసా ఇచ్చారు. నల్లమల అడవులను కాపాడటం కోసం తెలంగాణకు చెందిన విమలక్క రూపొందించిన బతుకమ్మ పాటను ట్వీట్ చేసిన పవన్.. నల్లమల కోసం విమలక్క పోరాటం స్ఫూర్తిదాయకమన్నారు.

నల్లమల అడవుల్లో యురేనియం తవ్వకాలకు వ్యతిరేకంగా జనసేనాని గళం వినిపించిన సంగతి తెలిసిందే. తెలంగాణలోని అమ్రాబాద్ అటవీ ప్రాంతంలో యురేనియం తవ్వకాలు జరపొద్దంటూ కాంగ్రెస్ నేతలతో కలిసి పవన్ డిమాండ్ చేశారు. దీంతో యురేనియం తవ్వకాలకు తాము అనుమతించలేదని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. తాజాగా ఇదే విషయమై ఏపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు పవన్ కల్యాణ్.

కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ ప్రాంతంలో యురేనియం కోసం డ్రిల్లింగ్ ప్రారంభమైందని ఓ జాతీయ పత్రిక కథనాన్ని ప్రచురించింది. ఆ వార్తను ట్వీట్ చేసిన పవన్.. ‘‘ఆళ్లగడ్డ ప్రాంతంలో యురేనియం కోసం డ్రిల్లింగ్ జరుగుతోందని కథనాలు వస్తున్నాయి. ఈ విషయంలో ఏపీ ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలి. ఏపీ ప్రభుత్వానికి తెలియకుండా ఇదెలా జరుగుతుంది? జిల్లా కలెక్టర్‌కు ఈ విషయం తెలియకపోవడం ఆశ్చర్యం కలుగుతుంది’’ అని పవన్ ట్వీట్ చేశారు.