బొట్టుతో అమాయకంగా నా చుట్టూ తిరిగేవారు.. మంత్రి కాగానే మర్చిపోయారా
ఏపీ పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ పై జనసేనాని ఫైర్ అయ్యారు. ఇసుక కొరతపై జనసేన నిర్వహించిన లాంగ్ మార్చ్ గురించి మంత్రి అవంతి చేసిన విమర్శలను పవన్

ఏపీ పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ పై జనసేనాని ఫైర్ అయ్యారు. ఇసుక కొరతపై జనసేన నిర్వహించిన లాంగ్ మార్చ్ గురించి మంత్రి అవంతి చేసిన విమర్శలను పవన్
ఏపీ పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ పై జనసేనాని ఫైర్ అయ్యారు. ఇసుక కొరతపై జనసేన నిర్వహించిన లాంగ్ మార్చ్ గురించి మంత్రి అవంతి చేసిన విమర్శలను పవన్ ఖండించారు. లాంగ్ మార్చ్ రాంగ్ మార్చ్ కాదన్నారు. లాంగ్ మార్చ్ కు అద్భుతమైన స్పందన వచ్చిందన్నారు. లాంగ్ మార్చ్ గురించి విశాఖలో మీడియాతో మాట్లాడిన పవన్.. అధికార పక్షంపై విమర్శలు చేశారు. మరీ ముఖ్యంగా మంత్రి అవంతి టార్గెట్ చేశారు.
పుట్టగానే… గడ్డంతో పుట్టి ఎదిగారా అని అవంతిని నిలదీశారు పవన్. బొట్టు పెట్టుకుని అమాయకంగా నా చుట్టూ తిరిగేవారు.. మంత్రి అవ్వగానే మర్చిపోతే ఎలా అని ప్రశ్నించారు. నా నటన నేనే చేశా.. మా అన్నయ్య చెయ్యలేదు అని కౌంటర్ ఇచ్చారు. ప్రజా సమస్యలను గాలికి వదిలేసి వ్యక్తిగతంగా విమర్శిస్తున్నారు.. వ్యక్తిగత విమర్శలకు దిగితే ప్రజల్లో విశ్వాసం కోల్పోతారని అధికార పక్షాన్ని పవన్ హెచ్చరించారు. సమస్యలు పరిష్కరించాలనే తాను వైసీపీ ప్రభుత్వాన్ని కోరుతున్నట్టు చెప్పారు. రెండు వారాల్లోగా ఇసుక కొరతను తీర్చాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు పవన్. లేదంటే తమ తదుపరి కార్యాచరణ ప్రకటిస్తామన్నారు. వ్యవస్థలో లోపాలు ఉన్నాయనే విషయాన్ని వైసీపీ గర్తించాలని పవన్ సూచించారు.
భవన నిర్మాణ కార్నికుల సమస్య పరిష్కరించేంత వరకు కార్మికులకు అండగా నిలబడాలని జనసైనికులను ఆదేశించారు పవన్. చనిపోయిన భవన నిర్మాణ కార్మికుల కుటుంబాలకు రూ.5లక్షలు ఎక్స్ గ్రేషియా ఇవ్వాలన్నారు. నిర్మాణ రంగం కుదుట పడేంత వరకు భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ నిధి నుంచి కార్మికులకు నెలకు రూ.50 వేలు చెల్లించాలని డిమాండ్ చేశారు. వర్షాలు,వరదలు ఏపీలోనే కాదు.. కర్ణాటక, కేరళలోనూ ఉన్నాయని పవన్ అన్నారు. ప్రభుత్వం తన విధానాలను సవరించుకోవాలాని సూచించారు. భవన నిర్మాణ కార్మికుల సమస్యలపై కమిటీ వేసి ప్రభుత్వానికి నివేదిక ఇస్తామని చెప్పారు.