తప్పా ఒప్పా : మాయావతి కాళ్లు మొక్కిన పవన్ కళ్యాణ్
విశాఖ: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీరు చర్చనీయాంశంగా మారింది. పవన్ చేసిన పని గురించి అంతా చర్చించుకుంటున్నారు. పవన్ చేసిన దాంట్లో తప్పేమీ లేదని కొందరు,

విశాఖ: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీరు చర్చనీయాంశంగా మారింది. పవన్ చేసిన పని గురించి అంతా చర్చించుకుంటున్నారు. పవన్ చేసిన దాంట్లో తప్పేమీ లేదని కొందరు,
విశాఖ: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీరు చర్చనీయాంశంగా మారింది. పవన్ చేసిన పని గురించి అంతా చర్చించుకుంటున్నారు. పవన్ చేసిన దాంట్లో తప్పేమీ లేదని కొందరు, ముమ్మాటికి తప్పే అని మరికొందరు అంటున్నారు. ఇంతకీ పవన్ ఏం చేశారో చెప్పలేదు కదూ.. ఎన్నికల ప్రచారంలో భాగంగా బహుజన సమాజ్ పార్టీ (బీఎస్పీ) అధినేత్రి మాయావతి మంగళవారం (ఏప్రిల్ 02, 2019) విశాఖపట్టణానికి వచ్చారు. ఎయిర్ పోర్టులో మాయావతికి జనసేనాని స్వయంగా వెల్ కమ్ చెప్పారు. ఆమె వచ్చిన కారు డోరు తీశారు. ఆ తర్వాత నమస్కారం చేశారు. అంతటితో ఆగలేదు.. ఏకంగా మాయావతి పాదాలకు మొక్కారు. ఆమెకు పాదాభివందనం చేశారు. పవన్ చేసిన పని ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. పవన్ తీరుని కొందరు తప్పుపడుతున్నారు.
మాయావతి కాళ్లకు పవన్ మొక్కడం ఏంటని మండిపడుతున్నారు. మాయావతిపై తీవ్రమైన అవినీతి ఆరోపణలు ఉన్నాయని, ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేశారని, అలాంటి ఆరోపణలు ఉన్న వ్యక్తికి పవన్ పాదాభివందనం చెయ్యడం ఏంటని క్వశ్చన్ చేస్తున్నారు. మరికొందరేమో పవన్ చర్యను సమర్థిస్తున్నారు. పెద్దల మీద తనకున్న గౌరవాన్ని పవన్ ఆ విధంగా చాటుకున్నారని వెనకేసుకొస్తున్నారు. పవన్ ఆమె బ్లెస్సింగ్ తీసుకోవడం తప్పు కాదని వాదిస్తున్నాకరు. పవన్ కళ్యాణ్ మాయావతి కాళ్లు మొక్కిన వీడియో వైరల్ గా మారింది.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బీఎస్పీతో పొత్తు పెట్టుకున్న సంగతి తెలిసిందే. ఎన్నికల పొత్తులో భాగంగా ఏపీ, తెలంగాణలో బీఎస్పీ-జనసేనలు కలిసి పోటీ చేస్తున్నాయి. రెండు పార్టీల అభ్యర్థుల తరపున ప్రచారం చేసేందుకు మాయావతి ఏపీకి వచ్చారు. 2 రోజుల పాటు పర్యటిస్తారు. ఏప్రిల్ 3వ తేదీ ఉదయం పవన్‌తో కలిసి విశాఖలో మీడియా సమావేశంలో పాల్గొంటారు. అనంతరం మధ్యాహ్నం 3 గంటలకు విజయవాడలోని మాకినేని బసవపున్నయ్య స్టేడియంలో బహిరంగ సభలో మాట్లాడతారు. ఏప్రిల్ 4వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు మాయావతి తిరుపతి ఎస్వీ స్టేడియంలో బహిరంగ సభలో పాల్గొంటారు. ఆ తర్వాత సాయంత్రం 5 గంటలకు హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో బహిరంగ సభలో ప్రసంగించనున్నారు.