PM Modi Road Show : మల్కాజిగిరిలో ప్రధాని రోడ్​షో.. ఓపెన్ టాప్ వాహనం ఎక్కిన మోదీ!

PM Modi Road Show : మల్కాజ్ గిరి, హైదరాబాద్, చేవెళ్ల, సికింద్రాబాద్, భువనగిరి అభ్యర్థులతో మోదీ రోడ్ షో కొనసాగింది. అయితే, రోడ్ షోలో ప్రధాని మోదీ వెంట కిషన్ రెడ్డి, ఈటల రాజేందర్ కూడా ఉన్నారు.

PM Modi Road Show : మల్కాజిగిరిలో ప్రధాని రోడ్​షో.. ఓపెన్ టాప్ వాహనం ఎక్కిన మోదీ!

PM Narendra Modi Road Show in Malkajgiri

Updated On : March 15, 2024 / 7:29 PM IST

PM Modi Road Show : లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటిస్తున్నారు. శుక్రవారం (మార్చి 15న) మల్కాజిగిరి లోక్‌సభ స్థానం పరిధిలో మోదీ రోడ్‌షో ప్రారంభమైంది. ఈ సందర్భంగా రోడ్ షోకు మోదీకి పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున ఘన స్వాగతం పలికారు.

మీర్జాలగూడ నుంచి మల్కాజిగిరి క్రాస్‌ వరకు దాదాపు 1.2 కిలోమీటర్ల మేర రోడ్ షో కొనసాగనుంది. మల్కాజిగిరిలో అశేష జనవాహినితో రోడ్లన్నీ కాషాయమయంగా మారాయి. రోడ్ షోలో మోదీతో పాటు 5 లోక్‌సభ నియోజకవర్గాల అభ్యర్థులు కూడా ఉన్నారు.

Read Also : Kishan Reddy : ఎమ్మెల్సీ కవిత ఇంట్లో ఈడీ సోదాలపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

మల్కాజ్ గిరి, హైదరాబాద్, చేవెళ్ల, సికింద్రాబాద్, భువనగిరి అభ్యర్థులతో మోదీ రోడ్ షో నిర్వహిస్తున్నారు. అయితే, రోడ్ షోలో ప్రధాని మోదీ వెంట కిషన్ రెడ్డి, ఈటల రాజేందర్ కూడా ఉన్నారు. మల్కాజ్‌గిరి క్రాస్ రోడ్‌లో రోడ్ షో ముగిసిన అనంతరం ప్రధాని మోదీ రాజ్‌భవన్‌కు వెళ్లనున్నారు. ఈ రాత్రి అక్కడే బస చేయనున్నారు. శనివారం (మార్చి 16న) ప్రధాని మోదీ నాగర్‌కర్నూల్‌లో పర్యటించనున్నారు. ఇందులో భాగంగా బహిరంగ సభలో మోదీ పాల్గొననున్నారు.

Read Also : PM Modi Road Show : మల్కాజ్‌గిరిలో ప్రధాని మోదీ రోడ్‌షో.. పోలీస్ హై అలర్డ్.. కేంద్ర, రాష్ట్ర బలగాలతో భారీ భద్రత!