Ahmedabad: ఎన్నికల నుంచి తప్పుకుంటే మా మంత్రుల్ని ఒదిలేస్తామన్నారు.. బీజేపీపై కేజ్రీవాల్ తీవ్ర ఆరోపణలు
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోతామని బీజేపీ భయపడుతోందని అన్నారు. ప్రస్తుతం తాము రాష్ట్రంలో రెండవ స్థానంలో ఉన్నామని, ఈ ఎన్నికల్లో మొదటి స్థానం కోసం పోరాడుతున్నామని అన్నారు. వాస్తవానికి బీజేపీ, కాంగ్రెస్ తర్వాత ఆప్ మూడో స్థానంలో ఉంటుందని ఒపీనియన్ పోల్స్ చెబుతున్నాయి. కానీ, కేజ్రీవాల్ ఏరోజూ కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేయకపోవడం గమనార్హం.

Quit Gujarat, we will release Satyendar Jain says Kejriwal claims BJP made an offer
Ahmedabad: సరిగ్గా ఎన్నికల వేళ భారతీయ జనతా పార్టీపై అరవింద్ కేజ్రీవాల్ తీవ్ర ఆరోపణలు చేశారు. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల నుంచి తప్పుకుంటే ఢిల్లీ మంత్రులైన మనీశ్ సిసోడియా, సతేంద్ర జైన్లను వదిలేస్తామని బీజేపీ నుంచి తనకు ఆఫర్ వచ్చిందని ఆయన శనివారం ఆరోపించారు. మనీ లాండరింగ్ కేసులో అరెస్టైన సత్యేంద్ర జైన్ ఇప్పటికే తిహార్ జైలులో శిక్ష అనుభవిస్తున్నారు. ఇక మనీశ్ సిసోడియాపై ఈడీ సహా కేంద్ర దర్యాప్తు సంస్థలు వరుస దాడులు చేస్తున్నాయి.
‘‘ముందు మనీశ్ సిసోడియాకు ముఖ్యమంత్రి పదవి ఆఫర్ చేశారు. అందుకు ఆయనను ఆప్‌ను వదిలేయమని చెప్పారు. ఆ ఆఫర్‌ను తిరస్కరించారు. ఇప్పుడు వాళ్లు (బీజేపీ) నన్ను కలిశారు. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల నుంచి తప్పుకుంటే సత్యేంద్ర జైన్, మనీశ్ సిసోడియా మీద ఉన్న కేసులను ఎత్తేస్తామని, వారిని ఇక వదిలేస్తామని చెప్పారు’’ అని కేజ్రీవాల్ అన్నారు. అయితే ఈ ఆఫర్ ఎవరిచ్చారని ప్రశ్నించగా.. వారు తనను నేరుగా కలవలేదని, తనకు అత్యంత సన్నిహిత వ్యక్తులతో సమాచారం పంపించారని చెప్పారు. అయితే తన సన్నిహితుల గురించి బయటికి వెళ్లడించలేనని కేజ్రీవాల్ అన్నారు.
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోతామని బీజేపీ భయపడుతోందని అన్నారు. ప్రస్తుతం తాము రాష్ట్రంలో రెండవ స్థానంలో ఉన్నామని, ఈ ఎన్నికల్లో మొదటి స్థానం కోసం పోరాడుతున్నామని అన్నారు. వాస్తవానికి బీజేపీ, కాంగ్రెస్ తర్వాత ఆప్ మూడో స్థానంలో ఉంటుందని ఒపీనియన్ పోల్స్ చెబుతున్నాయి. కానీ, కేజ్రీవాల్ ఏరోజూ కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేయకపోవడం గమనార్హం.
Gujarat Poll : ఒకేఒక్క ‘ఓటరు’ 8 మంది సిబ్బందితో ప్రత్యేక పోలింగ్ కేంద్రం