Congress Crisis: గెహ్లాట్ తీరుపై కాంగ్రెస్ కమిటీ ఆగ్రహం.. అధ్యక్ష రేసు నుంచి తప్పించాలంటూ…

ఈ విషయమై సీడబ్ల్యూసీలోని ఒక ముఖ్య నేత దీనిపై స్పందిస్తూ ‘‘వ్యక్తిగత వైరాల కోసం కాంగ్రెస్ పార్టీని రెండుగా చీల్చాడు. ఇలాంటి వ్యక్తిపై ఎలా నమ్మకం పెట్టుగోలం? గెహ్లాట్ అభ్యర్థిత్వంపై పార్టీ మరోసారి ఆలోచించాలి’’ అని సోమవారం అన్నట్లు పార్టీ నుంచి లీకులు వస్తున్నాయి. పార్టీలోని సీనియర్ నేతల్లో ఒకరిని ఎంపిక చేసి అధ్యక్ష పదవి రేసులో నిలపాలని సీడబ్ల్యూసీ నేతలు కోరుతున్నారు.

Congress Crisis: గెహ్లాట్ తీరుపై కాంగ్రెస్ కమిటీ ఆగ్రహం.. అధ్యక్ష రేసు నుంచి తప్పించాలంటూ…

Rajasthan political crisis: Congress committee urges Sonia Gandhi to pull Ashok Gehlot out of party president race

Updated On : September 26, 2022 / 2:51 PM IST

Congress Crisis: రాజస్తాన్ కాంగ్రెస్ పార్టీలో రేగిన కలకలంపై కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందుకు కారణమైన ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్‭ను కాంగ్రెస్ అధ్యక్ష రేసు నుంచి తప్పించాలంటూ పార్టీ తాత్కాలిక అధినేత సోనియా గాంధీని సోమవారం డిమాండ్ చేశారు. మరో వ్యక్తిని పోటీకి ఎంపిక చేయాలని సోనియాకు వర్కింగ్ డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది.

ఈ విషయమై సీడబ్ల్యూసీలోని ఒక ముఖ్య నేత దీనిపై స్పందిస్తూ ‘‘వ్యక్తిగత వైరాల కోసం కాంగ్రెస్ పార్టీని రెండుగా చీల్చాడు. ఇలాంటి వ్యక్తిపై ఎలా నమ్మకం పెట్టుగోలం? గెహ్లాట్ అభ్యర్థిత్వంపై పార్టీ మరోసారి ఆలోచించాలి’’ అని సోమవారం అన్నట్లు పార్టీ నుంచి లీకులు వస్తున్నాయి. పార్టీలోని సీనియర్ నేతల్లో ఒకరిని ఎంపిక చేసి అధ్యక్ష పదవి రేసులో నిలపాలని సీడబ్ల్యూసీ నేతలు కోరుతున్నారు.

అశోక్ గెహ్లాట్ అనంతరం రాజస్తాన్ సీఎంగా ఎవరు ఉంటారన్న దానిపై రాజకీయం మొదలైంది. గెహ్లాట్ వర్గానికి చెందిన 90 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు. గెహ్లాట్ తర్వాత సచిన్ పైలట్‌ను సీఎంగా చేస్తారు అనే ఊహాగానాల నేపథ్యంలో, దీన్ని వ్యతిరేకిస్తూ అశోక్ గెహ్లాట్ వర్గం రాజీనామాకు తెరతీసింది. దీంతో కాంగ్రెస్ పార్టీలో సంక్షోభం మొదలైంది.

అయితే, దీనిపై కాంగ్రెస్ అధిష్టానం ఆగ్రహం వ్యక్తం చేసింది. రాజస్థాన్ కాంగ్రెస్‌కు సంబంధించి ప్రతి నిర్ణయం అశోక్ గెహ్లాట్‌ను అడిగే తీసుకున్నామని చెప్పింది. మరోవైపు ఈ వివాదాన్ని అశోక్ గెహ్లాట్ కావాలనే సృష్టించారని అధిష్టానం భావిస్తోంది. అవసరమైతే కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు షోకాజ్ నోటీసులు ఇవ్వాలని కూడా భావిస్తోంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్ మల్లికార్జున ఖర్గే, ఇతర నేతలతో అశోక్ గెహ్లాట్ అత్యవసర సమావేశం నిర్వహిస్తున్నారు. తాజా పరిణామాల నేపథ్యంలో అధిష్టానం సీఎంగా ఎవరిని నియమించినా అంగీకరించాలనే నిర్ణయానికి అశోక్ వచ్చినట్లు తెలుస్తుంది. ఈ పరిణామాల వల్లే కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సైతం గెహ్లాట్‭పై ఆగ్రహంగా ఉంది.

CM KCR – PK TEAM : ప్రశాంత్ కిషోర్ సర్వేలపై గులాబీ బాస్ అసంతృప్తి .. పీకే టీమ్‌కు కేసీఆర్ కటీఫ్ చె్ప్పారా?