KTR చర్చలు : రామగుండం కార్పొరేషన్‌పై గులాబీ జెండా

తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఘన విజయం సాధించింది. కానీ..రామగుండం కార్పొరేషన్ విషయంలో సందిగ్ధత నెలకొంది. దీంతో ఎలాగైనా కార్పొరేషన్‌ను వశం చేసుకోవాలని టీఆర్ఎస్ వ్యూహాలు రచించింది. ఈ విషయంలో మంత్రి కేటీఆర్ స్వయంగా రంగంలోకి దిగారు. 2020, జనవరి 26వ తేదీ ఆదివారం పార్టీ నేతలు, ఇతరులతో చర్చలు జరిపారు.
టీఆర్ఎస్‌కు మద్దతు ఇచ్చేందుకు ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ అంగీకారం తెలిపింది. కేటీఆర్ ఎంట్రీతో రామగుండం కార్పొరేషన్ టీఆర్ఎస్ ఖాతాలోకి వెళ్లిపోయింది. మొత్తం 50 డివిజన్లలో టీఆర్ఎస్‌కు 18, ఫార్వర్డ్ బ్లాక్‌కు 9 మంది సభ్యులున్నారు. మ్యాజిక్ ఫిగర్ 26గా ఉంది. 27 మంది కార్పొరేటర్లు, ఇద్దరు ఎక్స్ అఫిషియో ఓట్ల ద్వారా టీఆర్ఎస్ బలం 29కి చేరింది.
ఏ పార్టీకి కూడా స్పష్టమైన తీర్పునివ్వలేదు ప్రజలు. 2014 ఎన్నికల్లో ఇదే తరహాలో తీర్పునిచ్చిన సంగతి తెలిసిందే. స్వతంత్ర అభ్యర్థుల మద్దతుతో టీఆర్ఎస్ పాలకవర్గాన్ని ఏర్పాటు చేయగలిగింది. రాజీకయ సమీకరణాలు మార్చాలని ఇతర పార్టీలు ప్రయత్నించాయి. కానీ అవి నెరవేరలేదు. అభివృద్ధిలో తాము భాగస్వామ్యం కావాలని టీఆర్ఎస్‌కు మద్దతు ఇచ్చినట్లు ఫార్వర్డ్ బ్లాక్ నేతలు వెల్లడిస్తున్నారు. రామగుండం మేయర్ అభ్యర్థిగా అనీల్ కుమార్, డిప్యూటీ మేయర్‌గా అభిషేక్ రావు పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి.
* మున్సిపల్ ఎన్నికల్లో కారు స్పీడుకు కాంగ్రెస్, బీజేపీ పార్టీలు కొట్టుకపోయాయి.
* టీఆర్ఎస్ 90 శాతం మున్సిపల్ ఛైర్ పర్సన్లు, 100 శాతం మేయర్ల పదవులను తన ఖాతాలో వేసుకోనుంది.
* 120 మున్సిపల్ ఎన్నికలు జరగగా 109 మున్సిపాల్టీలు టీఆర్ఎస్ వశం కానున్నాయి.
* స్వతంత్ర సభ్యులు, ఎక్స్ అఫిషియో సభ్యులతో పరిస్థితి తారుమారయ్యే అవకాశం ఉంది.
* రెండేసి చోట్ల బీజేపీ, ఎంఐఎం గద్దెనెక్కనున్నాయి.
ఫలితాలు : –
వార్డులు : 2727
టీఆర్ఎస్ – 1579
కాంగ్రెస్ – 541
బీజేపీ – 236
ఎంఐఎం – 71
ఇతరులు – 300
Read More : ఏం జరుగుతోంది : TDLP మీటింగ్‌కు నలుగురు ఎమ్మెల్సీలు దూరం..చేజారినట్లేనా ?